31, డిసెంబర్ 2022, శనివారం

హరిభజన చేయరేల

హరిభజన చేయరేల నరులార నేడే

పరమానందసంభరితాంతరంగులై


పరమపురుష కేశవ పట్టాభిరామ యనుచు

నరసింహ గోవింద నారాయణ యనుచు

కరివరద పాంచాలీవరద ప్రహ్లాదవరద

గిరిధారి గోపాల కరుణాలవాల యనుచు


కంసారి నరసఖా కమనీయవపుష యనుచు

హింసావిదూర మోహధ్వంసనప్రవీణ యనుచు

సంసారభయనివారక సాధుపోష యనుచు పరమ

హంసహృదయాకాశనిత్యవిహరణశుభశీల యనుచు


రామ తారకనామ యనుచు కామవైరి వినుత యనుచు

కామాదికవర్గనాశ ప్రజ్ఞానఘనస్వరూప.యనుచు

రామచంద్రబ్రహ్మాదిసంభావితప్రభావ యనుచు

భూమిసుతామనోహర సముద్రబంధన యనుచు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.