3, డిసెంబర్ 2022, శనివారం

వివరము గాను తెలిపెద మీకు

వివరము గాను తెలిపెద మీకు విభుని నామమహిమ


రాతిని నాతిగ మా‌ర్చివేసిన రామనామమహిమ

కోతికి బ్రహ్మపదంబు నొసగిన గొప్ప నామమహిమ


రాకాసులను పరుగిడజేసే రామనామమహిమ

శోకమోహముల నణగించే బహుసుఖదనామమహిమ


పలికెడివారిని పరిరక్షించే ప్రభువు నామమహిమ

దలచినంతనే తప్పకకాచే తండ్రి నామమహిమ


సుజనకోటిని సంరక్షించే శుభదనామమహిమ

కుజనుల కనునిత్యంబును భీతినిగొలుపు నామమహిమ


కపులను సేనగ నడిపిచూపిన ఘనుని నామమహిమ

అపమృత్యుభయాపహమై నిలిచే అమృతనామమహిమ


సాదరముగ సద్భక్తుల నేలే స్వామి నామమహిమ

వేదాంతప్రతిపాద్యబ్రహ్మమగు విభుని నామమహిమ


పవమానాత్మజముఖ్యులు కొలిచే ప్రభువు నామమహిమ

భవజలధిని దాటించు నౌకయై వరలు నామమహిమ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.