బుధవరులారా శ్రీరఘురాముని బుధ్ధిని దలచండీ ఆ
విధిశంకరులే ప్రస్తుతించు రఘువిభునే కొలవండీ
పరాత్పరుండగు శ్రీహరియే రఘుపతి యని యెఱుగండీ
కరుణామయుడగు రఘువీరునకే మరిమరి మ్రొక్కండీ
సరివారనగా శ్రీరామున కీజగమున లేరండీ
నరులకు శ్రీరఘురాముని తారకనామమె దిక్కండీ
తరచుగ నదియిది కోరి దేవతల తలచుట మానండీ
ధరణిని బహుదైవములను గొలుచుట తప్పని తెలియండీ
హరి కన్యులను గొలిచుట నిష్ఫల మన్నది తెలియండడీ
నరులీ తారకరాముని గొలిచిన మరల పుట్టరండీ
పరమేశ్వరుడా రఘువీరుండని భావన చేయండీ
పరమానందము హరికీర్తనమని మరువగ రాదండీ
పరమైశ్వర్యము హరికటాక్షమని యాత్మను తలచండీ
పరమాద్భుతమగు తారకనామమె పలుకుచు నుండండీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.