9, మార్చి 2024, శనివారం

ఎరుగరో రాముని

ఎరుగకున్న భవచక్రము విరుగదన్నుటెట్లు
నరులార శ్రీరాముని యెరుగవలయును

ఎరుగరో రాముని యిందీవరశ్యాముని

   కుందరదను మందగమను సుందరాంగుని


ఎరుగరో రాముని యినకులాభిసోముని

    సురవిరోధి గణవిరోధి నరవరేణ్యుని


ఎరుగరో రాముని సురనరమునిచర్చితుని

   పరమయోగి హృదయపద్మవాసు నీశుని


ఎరుగరో రాముని యిలకుదిగిన శ్రీహరిని

  వరములిచ్చి ప్రొచునట్టి భక్తవరదుని


ఎరుగరో రాముని ఎల్లజగములను చేసి

   కరుణతోడ పాలించెడు పరమేశ్వరుని


ఎరుగరో రాముని ధరాధరధీరుని

   నరులకెల్ల మోక్షమిచ్చు నారాయణుని

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.