బహుళముగ పొగడితే రామ
బహుమతిగ నేమిత్తువో
జ్ఞానసాగరుడవు సర్వేశ్వరుడ వని
దీననాథుడవని మానుగ ప్రీతితో
జానకీపతి నాకు సర్వంబు నీవని
నేను నీదాసుడనే యని భక్తితో
విశ్వవంద్యుడవని విశ్వనాథుడవని
విశ్వంబులను నీవె వెలయించి నావని
విశ్వపోషకుడవు విశ్వరూపుడవని
శాశ్వతుడవు నాకు స్వామివి నీవని
కరిరాజవరదుడవు కపిరాజవరదుడవు
గిరిజేశవినుతుడవు పరమపావనుడవు
సురవైరిదుర్వంశశోషణనిపుణుడవు
పరమభక్తవరదబిరుదాంకితుడ వని
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.