12, మార్చి 2024, మంగళవారం

సీతారామచంద్ర స్వామి

సీతారామచంద్ర స్వామి సీతారామచంద్ర స్వామి
నీతిమాలిన పనులు జూచి నీవు కోపగించవా

మార్చినారు నీగోత్రము మహాపరాధమే కదా

మార్చినారు నీనామమె మహాపరాధమే కదా


మార్చినారు చరిత్రనే మహాపరాధమే కదా

మార్చి రొక గుడి యునికిని మహాపరాధమే కదా


శివుని తొలగించిరంటే చేయరాని తప్పు కదా

శివుడు నీవు వేరనుటే చేయరాని తప్ప కదా