షండుల కెందుకు చక్కని కన్యలు
బండల కెందుకు పరిమళ గంధం
మ్రొక్కను నీకను మూర్ఖున కేల
దక్కునయ్య భవతారకనామం
చుక్కలరాయని సొగసుల కన్న
చక్కదనంబున్న సాకేతరామ
నిక్కువముగ నిన్ను చక్కగ గొలిచి
మ్రొక్కిన వాడిక పుట్టుటలేదు
మ్రొక్కని వానికి మోక్ష మెక్కడిది
చక్కని దయగల సాకేతరామ
కనులు మూసుకయున్న కనరాదు జగము
మనసు మూసుకయున్న మరి లేదు పరము
తనుమోహమున జిక్కి నిను నమ్మ కున్న
నినకులేశ్వర భవ మెందుకు తొలగు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.