13, మార్చి 2024, బుధవారం

దండాలు దండాలు

దండాలు దండాలు దయగల మారాముడా
గండరగండడా కైకొనుమా దండాలు

శతకోటిదండాలు సాకేతనాయకా

శతకోటిదండాలు జానకీనాయకా

శతకోటిదండాలు జ్ఞానప్రదాయకా

శతకోటిదండాలు సంసారనివర్తకా


శతకోటిదండాలు జితశతమదనుడా

శతకోటిదండాలు జగదేకవీరుడా

శతకోటిదండాలు సర్వార్తిశమనుడా

శతకోటిదండాలు జయశీలి రాముడా


శతకోటిదండాలు సద్భక్తవరదుడా

శతకోటిదండాలు సకలమునివినుతుడా

శతకోటిదండాలు సర్వలోకేశుడా

శతకోటిదండాలు జగదభిరాముడా