శ్రీరామనామము మరువము మేము శ్రీరామపాదము విడువము
ఎప్పటికప్పుడు కాలప్రవాహం
బిటునటు మమ్ముల త్రిప్పినా
తప్పుడు మనుషులు మాజోలికొచ్చి
తిప్పలెంతగను బెట్టినా
కామాదులే మమ్ము కొట్టి కట్టి యుంచ
గట్టిగాను యత్నించినా
ఏమేమె మతములు చెడగొట్టి పడగొట్ట
నెంతగ ప్రయత్నించినా
భ్రమలుపెట్టెడు కలి బలెబలె కనికట్లు
బ్రహ్మాండముగను చేసినా
యముడో గిముడో వచ్చి అదిలించి బెదిరించి
యల్లరల్లిరియె చేసినా
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.