ఆటకాడ నీయాట కంతేది రాముడా
వేడుకగా పావుగా నాడింతువు నన్ను
తొడిగితి నొకవేయి తొడుగులు నీయాటలో
నడచితి నొకవేయి నడకలు నీయాటలో
బడసితినా పాపము బడసితినా పుణ్యము
బడసిన దెల్ల నీకృపావిశేషమేరా
ఏయే రూపములం దెంతగ నాడితినో
యేయే నటనలం దేవింత లాయెనో
నాయజ్ఞానమ్మిది నన్నెరుగ నీయదు
నీయాట నెరిగినది నీవొక్కడవేరా
ఇంకెంతగా యాడ నీపావు పండునో
ఇంకెంతగా పాడ నీపావు పండునో
ఇంకెన్ని గడులలో నీపావు నడచునో
ఇంకెవ్వరికి యెఱుక యిది నీయాటయె
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.