రామరామ యనుటకే నామది యుబలాటపడును
ప్రేమగ నితరముల నేరీతిని భావించును
అది చూడు మిది చూడు మనగలవా కనులు
అది రుచ్య మిది రుచ్య మనగలదా రసన
అది శ్రావ్య మిది శ్రావ్య మనగలవా చెవులు
మది యింద్రియంబులను మనుపని యెడల
అది గొప్ప దిది గొప్ప యనగలదా బుధ్ధి
అది మంచి దిది మంచి దనగలదా బుధ్ధి
అది కోరు మిది కోరు మనగలదా బుధ్ధి
వదలక శ్రీరామభజన మనసు చేయుగ
ఇది పగలని ఇది నిశయని యెంచున దున్నదా
ఇది గృహమని ఇది బయలని యెంచున దున్నదా
ఇది విధియని అది విధియని యెంచున దున్నదా
హృదయము శ్రీరామనామ మాలపించగ
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.