అది యుండి ప్రయోజనం బన్నది కలదా
అది యెట్టుల కలుగునో హరికే యెరుక
హరిభజనలు జరుగని యూ రది యెక యూరా
హరిపూజలు జరుగని గృహ మది యొక గృహమా
హరికీర్తన చేయని తను వది యొక తనువా
హరిభక్తికి నోచని మస సది యొక మనసా
హరిపూజలు జరుగని గృహ మది యొక గృహమా
హరికీర్తన చేయని తను వది యొక తనువా
హరిభక్తికి నోచని మస సది యొక మనసా
హరికొఱకు కానిది క్రతు వది యొక క్రతువా
హరికొఱకు కానిది తప మది యొక తపమా
హరిచరణము తాకని కర మది యొక కరమా
హరిపథము కాని పథం బది యొక పథమా
హరికొఱకు కానిది తప మది యొక తపమా
హరిచరణము తాకని కర మది యొక కరమా
హరిపథము కాని పథం బది యొక పథమా
హరిభక్తులు చేరని సభ యది యొక సభయా
హరి నెఱుగని వాని బ్రతు కది యొక బ్రతుకా
హరిని చాటిచెప్పని చదు వది యొక చదువా
హరేరామ యనని దినం బది యొక దినమా
హరి నెఱుగని వాని బ్రతు కది యొక బ్రతుకా
హరిని చాటిచెప్పని చదు వది యొక చదువా
హరేరామ యనని దినం బది యొక దినమా
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.