రామనామ మొక్కటే రామనామ మొక్కటే
రామనామ మొక్కటే రక్షించును
దొంగ లార్గు రొక్కటై తోచి నీమనశ్శాంతి
భంగపరచి నప్పుడా భగవన్నామం
గ్రహములన్ని క్రూరములై దహియించుచు మనశ్శాంతి
అహరమును వేధించిన హరి శుభనామం
చెడుబుధ్ధుల వారివలన చెడగ నీమనశ్శాంతి
అడుగడుగున తోడగుచు హరి శుభనామం
నమ్ముకున్న వారు నిన్ను నట్టేటను ముంచినచో
నెమ్మదిగా మనశ్శాంతి నీకు కూర్చుచు
దారేషణ పుత్రేషణ ధనేషణ త్రయము నందు
కూరుకొనిన నీకు మంచిదారి చూపుచు
పగులగొట్ట నసాధ్యమౌ భవచక్రము నందు చిక్కి
దిగులుపడెడు నీభయమును దీర్చి బ్రోచుచు
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.