శరణు శరణు రామ సాకేత రామ
కరుణించి నేడు నా మొఱ వినవయ్య
శ్రీరామ జయరామ సీతారామ నను సం
సారజలధి దాటించుము సాకేతరామ
కారుణ్యాంబుధి రామ కమనీయనామ సం
సారజలధి దాటించుము సాకేతరామ
కారుణ్యాంబుధి రామ కమనీయనామ సం
సారజలధి దాటించుము సాకేతరామ
మారవైరివినుత రామ మారజనక రామ సం
సారజలధి దాటించుము సాకేతరామ
ధారాధరశ్యామ రామ నీరజాక్ష రామ సం
సారజలధి దాటించుము సాకేతరామ
నారాయణ పరంధామ నన్నేలెడు రామ సం
సారజలధి దాటించుము సాకేతరామ
నేరక దిగబడితి రామ నేరమెంచకుండ సం
సారజలధి దాటించుము సాకేతరామ
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.