8, మార్చి 2024, శుక్రవారం

శివశివ శివశివా


శివశివ శివశివా భవభవ భవభవా

వివరింప శక్యమా విభో నీమహిమ

 

శివశివ నీదయచే శ్రీరామనామమే

అవలీలగ నానాలుక కంటుకపోయె

భవభవ నీదయచే పావనమైనట్టి

భవతారకమంత్రము బడిసితి నేను


హరహర నీదయచే హరిభక్తి నాలో

నిరంతరాయముగ నిలచియున్నది

పురహర నీదయచే పొందిన బుధ్ధితో

హరితత్త్వ మందునా కబ్బెను నిష్ఠ


పరమశివ నీదయచే వదల నవివేకము

హరిహరు లొకటనుచు నర్దమైనది

హరుడవై నాకు శ్రీహరినామ మిచ్చితివి

హరివగుచు మోక్షమే యందిచ్చితివి



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.