11, మార్చి 2024, సోమవారం

శరణము రామ సంసారతారకనామ


శరణము రామ సంసారతారకనామ 

శరణము కామారిసన్నుత శుభనామ


శరణము శ్రీరామ తరణికులేశ్వర

శరణము శ్రీరామ సకలసద్గుణధామ

శరణము శ్రీరామ వరమునిజనకామ

శరణము శ్రీరామ ధరణీసుతాకామ


శరణము శ్రీరామ శరనిధిబంధన

శరణము శ్రీరామ శరణాగతత్రాణ

శరణము శ్రీరామ నిరుపమవిక్రమ

శరణము శ్రీరామ సురవైరినాశన


శరణము శ్రీరామ సురగణతోషణ

శరణము శ్రీరామ సంతతజయశీల

శరణము శ్రీరామ సద్భక్తపోషణ

శరణము శ్రరామ హరి జగదభిరామ