13, మార్చి 2024, బుధవారం

కోదండరాముడు

కోదండరాముడు మాకోదండరాముడు
మాదేవుడు సీతాపతి కోదండరాముడు

వేదనలు కలుగువేళ కోదండరాముడు

ఆదుకొను నెల్లప్పుడు కోదండరాముడు

కాదనక సాయపడును కోదండరాముడు

వేదమయాకృతియైన కోదండరాముడు


మేదినిపై నరజాతికి కోదండరాముడు

వేదధర్మమును తెలిపె కోదండరాముడు

మేదినీనందినిగూడి కోదండరాముడు

మేదినీమండలమేలె కోదండరాముడు


కోరుకున్న వారికెల్ల కోదండరాముడు

కోరిన వందించుచుండు కోదండరాముడు

కూరిమి గల భక్తులను కోదండరాముడు

ఆదరించి మోక్షమిచ్చు కోదండరాముడు