12, మార్చి 2024, మంగళవారం

బ్లాగులు ఎందుకు చదవాలి?


అసలు బ్లాగు అంటే ఒక వ్యక్తిగతమైన లాగ్ బుక్.


మనబ్లాగు మన ఆలోచనల లేదా మనకు నచ్చిన / తెలిసిన సమాచారం తాలూకు లాగ్ బుక్.


మనం దానిని అందరికీ అందుబాటులో ఉండేలా తెరచిన పుస్తకంలా ఉంచటం ఉంచకపోవటం పూర్తిగా మనిష్టం.


ఇదంతా అందరికీ తెలిసిందే.


తెలుగులో వెలువడుతున్న పబ్లిక్ బ్లాగులు వేల మీద ఉంటాయి.


ఒతే చాలా బ్లాగులు నిద్రాణస్థితిలో ఉన్నాయి.


చురుకుగా ఉన్న బ్లాగులు మరీ ఎక్కువ లేవు.


ఇది ఒక చింతించవలసిన.విషయం.


వెలువడుతున్న బ్లాగులు కూడా చాలావరకు ఆసక్తి కలిగించేలా లేవన్నది నిజం. ఇది మరింతగా చింతించవలసిన విషయం.


ఒక బ్లాగు అందించే సమాచారం విలువైనది కానపుడు అది ఒక నాయిస్ క్రియేటర్ అవుతుంది. అటువంటి బ్లాగులు హెచ్చుగా ఉంటే నాయిస్ పొల్యూజన్ తప్ప మరేమీ ఉండదు బ్లాగు లోకంలో.


జగ్రతగా గమనించే వారు ఇలా బ్లాగు కాలుష్యాన్ని గమనించే ఉంటారని నా నమ్మకం.


ఐతే విలువైన సమాచారం అంటే ఏమిటి అనే ప్రశ్న వస్తుంది కాబట్టి దాన్ని నిర్వచించుకుందాం.


సమాచారం కేవలం ఆసక్తికరంగా మాత్రమే కాక ఆలోచన కలిగించేది కావటం విలువైన సమాచారం మొదటి లక్షణం.


ఆది దాచుకోవలసిందిగా అనిపించటం  లేదా పదిమందితొ పంచుకొని చర్చించుకోవలసిందిగా అనిపించటం విలువైన సమాచారం లక్షణం.


అది భావితరాలకు అందించవలసినదిగా ఉండటం మరింత విలువైన సమాచారం లక్షణం.


ఈలక్షణాలు సుతరామూ లేని రొట్ట వ్రాతలతో నిండిన బ్లాగులు కాలుష్యం వెదజల్లుతున్నాయని అర్థం.


ప్రస్తుతం నాకు బ్లాగు లోకం కాలుష్య కాసారంగా కనిపిస్తోంది.


బ్లాగర్లు నాణ్యమైన విలువైన సమాచారం ఇవ్వటంలో అలక్ష్యం చేస్తున్నపుడు వ్యాఖ్యల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు అనుకోవటం అత్యాశ. అందుచేత బ్లాగుల్లో వ్యాఖ్యలు మరీ నాసిరకంగా ఉండి మరింత కాలుష్యం వెదజల్లుతున్నాయని నిర్మొగమాటంగా చెప్పవచ్చును.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.