సన్నుతాంగ సాకేతపురాధీశ్వర హరి శ్రీరఘురామా
నిన్ను కాక మరియెవ్వరి పొగడుదు నీరజాక్ష శ్రీరామా
నీదు శ్రీచరణమ్ముల నుంటిని నేను ధన్యుడను దేవా
కాదన కిత్తువు మంచివరమ్ములు కడుసంతోషము దేవా
వేదన లన్నియు నణగించెదవు వేయిదండములు దేవా
మాదోషములను పరిగణించక మమ్మేలెడు శ్రీరామా
అండపిండబ్రహ్మాండము లన్నిట నిండియున్న ఓదేవా
దుండగంపు రాకాసుల మూకల చెండుచుండు ఓదేవా
నిండుమనసుతో భక్తులకష్టము లెండగట్టు ఓదేవా
వెండికొండపై నుండు వేల్పు మదినుండు నట్టి శ్రీరామా
ఆలములందున తిరుగులేని శరజాలము గల ఓదేవా
మాలో నొకనిగ మసలి మాకు ఋజుమార్గము చూపిన దేవా
కాలము నెఱుగని కీర్తిచంద్రికలు కలిగివెలుగు ఓదేవా
లీలగ జీవుల భవశృంఖలముల నేలగూల్చు శ్రీరామా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.