చెప్పేది నీకేనయ్యా నేను
చెప్పేది వినవేమయ్యా
చెప్పీ చెప్పీ నోరు నొప్పిపుట్టుటె కాని
చెప్పేది యిసుమంత చెవిబెట్ట వేమయ్య
తప్పులు చూపించి తలత్రిప్పుకొని నీవు
తప్పించుకోరాదు దశరథనందన
గుణవంతుడవు నీవు గొప్పవాడవు నీవు
గుణహీనుడను నేను గోవింద నరుడను
ప్రణిపాతమును జేయు భక్తుడ నీదయా
గుణమును చూపించు మని వేడుచున్నాను
బహుభవములుగ నిన్ను ప్రార్ధించి ప్రార్ధించి
బహు డస్సియున్నాను పరమాత్మ శ్రీరామ
మహనీయగుణధామ మన్నించి మనవివిని
బహుమాన మిమ్మపవర్గంబు నికనైన
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.