ఏమి యొట్టు పెట్టుదు నే నినకులేశ్వర న
న్నేమి చేయ మందు వయ్య రామచంద్రుడ
తామసులను చేరననుచు దశరథాత్మజ ము
న్నే మనవి చేసి యుంటిని నీరజాక్షుడా
నీమాటను మీరననుచు నీరదశ్యామ యె
న్నే మారులు నీకు మాట నిచ్చితి నయ్యా
ఒరుల నెపుడు పొగడననుచు పరమాత్ముడ నే
మరిమరి వచియించలేదొ మధుసూదనా
సరసమైన కీర్తనలను సారసాక్షుడా నీ
కొఱకై విరచింతునంటిని గోవిందుడా
పరమైనను నిహమైనను భగవంతుడా నీ
కరుణ వలన కలిగినదే కదా కోరితి
నరహరి యింకేమిచేయ నమ్ముదువయ్యా
సరి సరి సెలవీయవయ్య సర్వేశ్వరుడా
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.