సింహిసన మెక్కెను సీతారాముడు నర
సింహుడు దానవవైరి సీతారాముడు
సింహుడు దానవవైరి సీతారాముడు
బాలుడై తాటకను పడగొట్టినా డొక
కోలతో సుబాహుని గొబ్బున కాల్చె నొక
కోలతో మారీచుని తూలగొట్టెను మన
నీలమేఘశ్యాముడు చాల వీరుడు
దనుజుల నడచె జనస్థానమందున బహు
దనుజల నడచె లంక ననిలోపలను ధర
దనుజకులదహనుడని వినుతికెక్కెను మన
మనుజేశుడు రాముడు మహావీరుడు
హరిని దానవాంతకు డని యందురు బలె
హరి వలె మహా దానవాంతకు డితడు సం
గరరంగమున బ్రహ్మ హరియని పిలిచె మన
నరనాధుడు రాముడు నారాయణుడు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.