13, మార్చి 2024, బుధవారం

సీతారామలక్షణులను సేవించండీ

సీతారామలక్షణులను సేవించండీ భవ
భీతిహేతువులను మీరు వెడలించండీ

సంసారము నీదలేక సతమత మగుచున్నారా

హింసామయజగతిలో నిముడలే కున్నారా


తాపత్రయమునకు జిక్కి తరచు పొగులుచున్నారా

కోపతాపములకు జిక్కి క్రుంగిపోవుచున్నారా


ఈషణత్రయంబు చేత నెంతో డస్సియున్నారా

భీషణుడగు యముని గూర్చి భీతి చెందుచున్నారా


తనువు మీది మోహంబును తరుమలేక యున్నారా

మనసు నదుపుచేయ లేక మథనపడుచు నున్నారా


పరమపదము చేరు దారి నెఱుగలేక యున్నారా

పరమపామరుండ ననుచు వెఱగు చెందుచున్నారా


భక్తి కుదురకున్న దని భయము చెందుచున్నారా

ముక్తి యెట్లు కలుగుననుచు బుధ్ధి నెంచుచున్నారా



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.