వేయిపడగల నీడలో విలాసముగ నుండు వాడు
మాయగొని రాము డగుచు మహికి చేరెను
మనకొరకై నరుడాయెను మాధవుడు ధరజొచ్చెను
వనజాక్షుడు రావణుని వధియించును వేగమె
వనముల కిదె వెడలినాడు జనస్థానమును చేరెను
మునుల కిదే మాటయిచ్చె నని మురిసిరి సురలు
హరిని గోరి చుప్పనాక యవమానము పొందినది
ఖరదూషణాదులను ఘనుడు తెగటార్చెను
మరి యిక రావణుడు వచ్చు మండిపడుచు వానితో
జరుగును ఘనయుధ్ధం బని సురలు తలచిరి
అరెరే దుర్మార్గుడు మన అమ్మ నెత్తుక పోయె
హరిలీల యిదేమిటనుచు సురలు.వగచిరి
హరి వానిని వెంబడించి యాతని సపరివారముగ
నరికి పోగులుపెట్టగా సురలు చాల మురిసిరి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.