అనుటకైనా వినుటకైనా
అందమైనది రామనామము
అనుటకైనా వినుటకైనా
అనుటకైనా వినుటకైనా
అమృతమే యీరామనామము
రామనామము కలిగి కవుల
రచన లెంతో అందగించును
రామనామము కలిగి కవుల
రచన లమృతము చిందుచుండును
గానమందున రామనామము
ఘనత చెందుచు నందగించును
గానమందున రామనామము
వీనులం దమృతమును కురియును
శివుడు మెచ్చిన రామనామము
జిహ్వపై కడు నందగించును
శివుడు మెచ్చిన రామనామము
జీవి కమృతపదము నిచ్చును
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.