బుడిబుడియడుగుల నిడుచు పొలుచునట్టి బాలుడా
పుడమిని కడు తేజముతో పొడమిన శ్రీరాముడా
అన్నప్రాశనము నాడే అందుకొంటి వయా విల్లు
నిన్ను జూచి నాడు మేము నిక్కముగా మురిసితిమి
చిన్న విల్లు కాదు నీవు శీఘ్రముగా కోదండము
కన్నుల పండువుగ పట్ట కనుగొను దిన మదెప్పుడో
ఎపుడు పెద్దవాడ వగుదు వెపుడు విల్లు పట్టెదవో
ఎపుడు శివుని వింటినెత్తి యెటుల బలము చూపెదో
ఎపుడు ధరణిజాతకరము కృపతో గైకొనెదవో
ఎపుడు రావవణుశిరము లెగురగొట్టి నిలచెదవో
వేచియున్నాము ప్రభో విష్ణుతేజ రామ నీవు
నీ చేసిన ప్రతిన దీర్చి నిలింపుల నేర్చు నట్టి
బూచి దశకంఠుని జంపి భూరియశము గొను టెపుడో
మాచే పూజలను గొనెడు మంచిదినం బదెప్పుడో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.