21, సెప్టెంబర్ 2019, శనివారం
ఎదురులేని మనిషిగా యిలకు దిగిన
ఎదురులేని మనిషిగా యిలకు దిగిన దేవుడు
ఇదివర కెరుగనివి తా నెన్నెన్నో చేసె
తొలివేటుగ రాకాసిని తూలనేసినది వాడె
అలవోకగ హరునివింటి నంటి యెత్తె వాడె
అలిగిన పినతల్లి కోర నడవికేగినది వాడె
ఇలనెల్ల సవతితమ్ము నేలమనెను వాడె
మునుల కొఱకు వేలాది దనుజుల తెగటార్చె
వనిత కొఱకు సాగరమును బంధించి మించె
మొనగాడై రావణుని మొత్తిమొత్తి జంపె
జనుల కొఱకు ధర్మరాజ్యంబును స్థాపించె
శ్రీరామ శరణమంటె చింతలన్ని దీర్చె
తారకముగ తననామము ధరణిజనుల కిచ్చె
చేరి కొలువరో జనులు నారాయణు డితడు
నోరారగ పాడరో మీరు వీని సత్కీర్తిని
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్
(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )
గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.