21, సెప్టెంబర్ 2019, శనివారం
పుట్టించిన దేవుని పట్టించుకొనకుండ
పుట్టించిన దేవుని పట్టించుకొనకుండ
పుట్టి బుధ్ధెరిగి యింత పూజ చేయకుండ
ఏమేమి చదువు గాక యేమి లాభ ముండు
ఏమేమి చేయు గాక యేమి లాభ ముండు
ఏమేమి గడించు గాక యేమి లాభ ముండు
ఈమానవ జన్మమెత్తి యేమి లాభ ముండు
వాడు గొప్ప కులమందు ప్రభవమంద నేమి
వాడు వసంతుని వంటి వాడైతే నేమి
వాడు దానకర్ణుడని పదుగురన్న నేమి
వాడు పుట్టి గడించిన ఫలమెన్నగ సున్న
ఎన్ని జన్మముల నెత్తి యిన్నాళ్ళకు వాడు
సన్నుతించ దగిన నర జన్మమునకు వచ్చి
యెన్నడును రామ కృష్ణ యనకుండ గడపి
తిన్నగ యముని చేరి తిట్లు బడయు గాదె
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్
(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )
గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.