8, సెప్టెంబర్ 2019, ఆదివారం

సహజ లక్షణం!


పరోపకారాయ ఫలన్తి వృక్షాః పరోపకారాయ వహన్తి నద్యః ।
పరోపకారాయ దుహన్తి గావః పరోపకారార్థమిదం శరీరమ్ ॥

చాలా అందమైన శ్లోకం. చాలా ప్రసిధ్ధమైనది కూడా.

చెట్లు పండ్లను కాస్తున్నాయి.
అవి స్వయంగా తినటం కోసమా?
కాదు, పరోపకారం కోసం!
ఆపళ్ళను జీవులు ఆహారంగా అనుభవిస్తున్నాయి.
ముఖ్యంగా మనుష్యులు.

నదులు తీయని నీటితో ప్రవహిస్తున్నాయి.
ఆ నీళ్ళని అవి త్రాగుతున్నాయా?
కాదు, పరోపకారం కోసం!
నీరు లేనిదే జీవులకు మనుగడే లేదు.
ముఖ్యంగా మనుష్యులకు.

ఆవుల పాలిస్తున్నాయి.
అలా పాలను ఇచ్చేది తన మనుగడ కోసమా.
కాదు పరోపకారం కోసమే.
వాటి దూడలే కాదు, మనుషులకూ అవి అవసరమే

అందుకే జీవులు వీటినుండి ఒక నీతిని గ్రహించాలి.
తమ ఉనికి అన్నది పరోపకారం కోసమే అని.

ఈకోవ లోనివే మరికొన్ని కూడా చెప్పుకోవచ్చును. మేఘాలు వాన కురిసేది పరోపకారం కోసమే. సూర్యచంద్రుల వెలుగులు పరోపకారం కోసమే వగైరా.

కాని నిజం వేరుగా ఉంది.

ఏవీ పరోపకారం కోసం ఏమీ చేయటం లేదు.
మీకు నచ్చినా నచ్చక పోయినా ఇదే నిజం.
మీరు చేదు నిజం అనుకొన వచ్చును.
మీ యిష్టం.

చెట్లు పళ్ళు కాయటం వాటి సహజలక్షణం.
నదులలో నీళ్ళు ప్రవహించటం వాటి సహజలక్షణం.
క్షీరదాలు పాలివ్వటం వాటి సహజలక్షణం.
మేఘాలు వాన కురవటం వాటి సహజలక్షణం.
సూర్యుడు ఎండకాయటం, చంద్రుడు వెన్నల కురియటమూ వారి సహజలక్షణాలే.
రాయి కఠినంగా ఉండటం దాని సహజలక్షణం
వెన్న మెత్తగా ఉండటం దాని సహజలక్షణం
విషం ప్రాణాంతకం కావటం దాని సహజలక్షణం.
అంతకంటే మరేమీ లేదు.

సృష్టిలో ఉన్న ఈ సహజలక్షణాలను జీవులు తమతమ మనుగడకు అనువుగా గ్రహించి ప్రవర్తించటం జీవుల సహజలక్షణం అని కూడా మనందరం గ్రహించాలి.

ఈ విషయంలో సృష్టి సహజత్వాలే కాని పరోపకారాలు అంటూ ఏమీ లేవు.

నాస్తికుడు ఠాఠ్ దేవుడూ లేడూ  దెయ్యమూ లేదు అని బల్లగుద్ది వాదిస్తాడు. అతడి సహజలక్షణం అది.
భక్తుడు తన యిష్టదైవాన్ని ఎంతో ప్రేమగా స్మరిస్తాడు, కీర్తిస్తాడు అది అతడి సహజలక్షణం.

అవును కాని, ఈ సోది అంతా ఎందుకు చెప్తున్నాను అన్న అనుమానం రావచ్చును పాఠకులకు. దానికి ఒక కారణం ఉంది.

ఈ మధ్యకాలంలో నేను బ్లాగుల్లో వ్యాఖ్యలు వ్రాయటం మానుకున్నాను. ఆ పని ఈబ్లాగులో ప్రకటించి మరీ చేసాను. కాని తిరిగేకాలూ తిట్టే నోరూ ఊరకే ఉండలేవన్న సామెత ఉంది కదా. అలాగే అతి అరుదుగా మాత్రం కావాలనో పొరపాటునో గ్రహపాటునో వ్యాఖ్యలు ఇంకా వ్రాయటం జరుగుతున్నది. భగవంతుడు నన్ను అనుగ్రహించి ఆ దురలవాటు కూడా పోయేట్లు చేయగలడని ఆశిస్తున్నాను.

అలాంటి అలవాటైన పొరపాటు కారణంగా ఒకానొక బ్లాగులో ఒక వ్యాఖ్యను వ్రాయటం జరిగింది. ఆ వ్యాఖ్యకు ఒక మిత్రుడు నా ఉబోసకు మండి పడి చెడామడా నాకు నాలుగు వడ్డించటం కూడా జరిగింది.

ఐతే కొన్నికొన్ని మాటలకు సమాధానం నాకు నేనైనా చెప్పుకొని రికార్డు చేసుకొనవలసిన అగత్యం ఉందని భావించి ఈ నాలుగు ముక్కలూ వ్రాస్తున్నాను.

నాకు వడ్డింపుగా వచ్చిన ఒక హాట్ ఇది.

What you have achieved by Just writing a kirtan for a day?Do you think you are the only devotee, and I am not? Doing prayers in your own hermitage and craving for moksha yourself is a crime when your religious community is in danger!


నేను కీర్తనలు వ్రాయటానికి కారణం నా రామభక్తి ఐతే, నా రామభక్ర్తికి కారణం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. అది నా సహజలక్షణం. అంతే. నేను ఏదో సాధించాలని భావించి ఈరామసంకీర్తనం చేయటం లేదు. అయాచితంగా ఐనా సరే ఈ రామసంకీర్తనం వలన ఏదో సాధించాననీ అనుకోవటం లేదు.

ఇక్కడ మిత్రులు ఒక మంచి మాట అన్నారు. నామతం ప్రమాదంలో ఉంటే నేను నాస్వార్థం కోసం మోక్షాన్ని ఆశించటం నేరం అని. చక్కని ఆలోచన.

నాకు వడ్డించబడిన మరొక హాట్ గురించి కూడా ప్రస్తావించాలి.

How do you acquire knowledge? Have you got it yourself! Some teacher taught you, am I right?

ఇదే హాట్‍ను తెలుగులో మారువడ్దన చేయటం కూడా గమనించండి

మీకు రామభక్తి ఎట్లా అబ్బింది - మన ముందుతరాల వాళ్ళు ప్రిజర్వ్ చెయ్యబట్టే కదా!డైరెక్టుగా వాల్మీకి మీకు కల్లో కనబడి చెప్పాడా?

సాధారణమైన విద్యాబుధ్ధుల విషయంలో ఈమాటలు ఒప్పదగినవే. కాని నా రామభక్తి అన్నది నాకు పుట్టువుతో వచ్చినదే కాని నా తల్లిదండ్రులతో సహా ఎవరూ పనిగట్టుకొని నాకు రామపారమ్యం ప్రబోధించగా వచ్చినది కాదు.

నేను ఆరవతరగతిలో ఉండగానే ఒకానొక సందర్భంలో రామధ్యానంలో నిమగ్నుడినైన సంగతి మా తండ్రిగారు గమనించి సంతోషించటం జరిగింది. అప్పుడు మాత్రం ఆయన ఈమార్గం వదలవద్దు అని మాత్రం అదేశించారని మనవి చేయగలను.

రెండవసంఘటన నేను ఎనిమిదవ తరగతిలో ఉండగా జరిగింది. తరగతిలో పాఠం వింటూనే మధ్యలో ధ్యానంలోనికి వెళ్ళిపోతే గొప్ప హడావుడి జరిగిందట. నేనీ లోకంలోనికి వచ్చేసరికి పాఠశాలలో కాక ఇంట్లో ఉన్నాను. డాక్టరు గారు వచ్చి పరీక్షించి ఫరవాలేదని మా అమ్మానాన్నలతో చెప్పి వెళ్ళిపోయారు. ఒక గంటసేపో కొంచెం పైమాటో నేను నాలోకం ఉండిపోయి అందరినీ గాభరాపెట్టానని తెలిసింది.

ఈ సంఘటనలు జరిగే నాటికి నాకు రామకథ సమగ్రంగా అవగాహనలో ఉందని కూడా చెప్పరాదు. వాల్మీకి గురించి పెద్దగా తెలియదు. అసలు నాకు అప్పడు ఏమి తెలుసని? ఏమీ తెలియదు.

మీరెవరన్నా ఇది జన్మాంతర సంస్కారం అనుకుంటారా? మంచిది అలాగే అనుకోండి. నాకు అభ్యంతరం లేదు.

ఎవరన్నా సరే నా మాటలు నా డాంబికప్రవృత్తికి నిదర్శనాలనుకుంటారా? మంచిది అలాగే అనుకోండి. నాకు అభ్యంతరం లేదు.

ఎవరైనా నేనేదో ప్రచారం కోసమే రామకీర్తనలు వ్రాస్తునానని అనుకుంటే మంచిది అలాగే అనుకోండి. నాకు అభ్యంతరం లేదు. నా సహజలక్షణంగా నేను రామసంకీర్తనం చేసుకుంటున్నానని అనగలను కాని మీకు ఋజువులు చూపలేను. అటువంటి అవసరం కూడా లేదు నాకు.

నాగురించి నాకు ఏమి తెలుసునని? ఏమీ తెలియదు. అంతా ఆ రాముడికే తెలుసు.

నాది గండాలమారి ప్రాణం. ఎన్నో సార్లు తృటిలో బయటపడ్డాను. అన్ని సార్లూ నన్ను రాముడి సంకల్పమే ఇంకా భూమి మీద ఉండమని ఆదేశించింది. ఈ ఉపాధిలో ఉన్నాను.

ఇంతకు ముందు ఈబ్లాగులో చూచాయగా చెప్పానేమో గుర్తులేదు. ఇప్పుడు సూటిగానే చెబుతున్నాను. నాకు నిదర్శనాలున్నాయి పై మాటలను గురించి. ఊరికే చెప్పలేదు.

ఆరేళ్ళ క్రిందట చివరిసారిగా గండం గడిచింది ఈ ఉపాధికి. అప్పుడు సీతారామలక్ష్మణులను ప్రత్యక్షంగా దర్శించటం కూడా జరిగింది. ఈ ఉపాధిని మాయ ఆవరించి ఉండటం చేత విషయం నాకు ఆకళింపు అయ్యేందుకు కొంచెం సమయం పట్టిందప్పుడు.

అఖరుగా మరొక తెలుగు హాట్ వడ్దన ప్రస్తావిస్తాను

నా ధార్మిక క్షాత్రం నేను చూపించడానికి మీ సలహాలూ సంప్రదింపులూ నాకు అవసరమా?నేను మిమ్మల్ని అడిగానా!మీ పజ్యాలు మీరు రాసుకుంటూ సంతృప్తి పడిపొండి.

అలాగే వారు నాతో మెయిల్ ద్వారా జరిపిన సంభాషణలో నిష్కర్ష చేసిన మాట

So it is your mistake made me to talk like that and never do that mistake again! I have my integrity. I have my knowledge. I have my goal. I have my commitment. Who are you to tread on it again and again?

అనవసరంగా తలదూర్చినందుకే తప్ప ఆ మిత్రుడిచ్చిన విందుభోజనం మీద నాకేమీ ఫిర్యాదులు లేవు.  ఆయన నా గురించి మొదటనే idiotic people like you are detracting people like me! అన్నది గమనార్హం. తలదూర్చటం నా idiocy కావచ్చును.

ఈ టపా ద్వారా రెండు విషయాలు స్పష్టం చేయాలనుకున్నాను. మొదటిది, నాకు సహజలక్షణంగానే రామభక్తి అబ్బినది కాని ఒకరు ప్రబోధించగా కాదన్నది. రెండవది, వ్యాఖ్యలు వ్రాయను అన్న నా మాటకు నేను కట్టుబడటం అవసరం అని గుర్తించాను అన్నది. ఉచితబోడి సలహాలు ఇవ్వటమూ పశ్చాత్తాపపడటమూ అవసరం కాదు కదా!

6 కామెంట్‌లు:

  1. వృక్షాలు, నదుల పరోపకారం విషయంలో మీతో ఏకీభవిస్తాను. గోవులు మాత్రం పరోపకారం చేస్తున్నాయి అన్నది నిజం. గొమాత తన దూడలకు అవసరమైన పాలకంటే ఎక్కువగా ఇచ్చి మానవాళికి మేలు చేస్తుంది.

    I feel you are too sensitive in reacting to comments and take things t heart easily. Instead of so much seriousness, a bit of sense of humour and ability to laugh things off comes in handy.

    Taming one's ego is a life long process and I believe it is worth its effort.

    I still feel a learned person like you should offer comments and advice, occasional potshots notwithstanding.

    Maybe this is unsolicited advice but still this is my 'సహజ లక్షణం' to offer opinion.

    రిప్లయితొలగించండి
  2. సున్నితమయిన అంశం కనుక కాస్త సంకోచంగానే రాస్తున్నాను, అన్యధా భావించవద్దని మనవి.

    సహజ గుణం, పూర్వ జన్మ ఫలం, జన్మతః తెలిసిన విషయం, గురువుల బోధన, స్వయం కృషితో నేర్చుకున్నది: వీటిలో కొన్ని లేదా అన్నీ కావొచ్చును కాకనూపోవొచ్చు. కారణాలు (sources of knowledge, expertise & wisdom) ఏవయినా మీకంటూ ఒక విశిష్టత ఉంది.

    మానవ జీవితంటేనే నిరంతరాన్వేషణ. ఎంతటి నిష్ణాతులయినా తెలిసిన విషయాలు పంచుకోవడం ద్వారా ఇంకొంచం నేర్చుకుంటారు. Even the best expert learns when sharing his knowledge.

    మీరు చెప్పిన విషయాలు/అభిప్రాయాలు కొందరిలో కొందరికయినా (even if it is just 10%) లాభిస్తాయి. తప్పొప్పులు పక్కన పెడితే విషయానికి సంబంధం ఉండే ఇంకో కోణం అగుపించినా అది ప్రయాజనకరమే. నిశ్శబ్దం పాటించడం వలన ఈ సదుపాయం ఉండదు.

    ఒకవేళ (even if it is 90%) మీరు చెప్పింది తప్పే అయినా అందువలన ఎవరికీ పెద్దగా నష్టం ఉండదు. ఎవరయినా సరే తమతమ తర్కం & విజ్జ్యత ప్రకారం ఏ మేరకు స్వీకరించాలో బేరీజు వేసుకున్నాకే ఒప్పుకోవడం/విభేదించడం చేస్తారు.

    If correct definite benefits to everyone
    Else no harm to anyone
    Overall net positive

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గొట్టిముక్కల వారు,
      మీ కొంచెం దీర్ఘమైన వ్యాఖ్యకు ధన్యవాదాలు. ఎవరన్నా నా ఈ వ్యాసంలో సత్యం నూటికి సున్నపాళ్ళు సుమా అనుకున్నా నూటికి నూరుపాళ్ళుగా ఉంది అనుకున్నా నాకు పట్టింపు లేదని ముందే మనవి చేసాను. నా ప్రయాణంలో నా అనుభవాలను అవసరమనుకున్న మేరకు పంచుకుంటున్నాను. అవి ఇతరులకు లాభించితే మంచిదే. కాని ఎక్కువగా ఆశించటం లేదు. నిజానికి ఇంక ఏమీ ఆశించటం లేదు. నా వ్రాతల వలన ఇతరులకు హాని లేదని మీరనుకోవటంతో లోకంలో అక్కడక్కడా కొందరు ఏకీభవించకపోవచ్చు నండి.

      తొలగించండి
  3. ఒక మిత్రుడు అని దాచెయ్యటం దేనికి?ఆ వడ్డన చేసింది నేనే కదా!మీరు మొత్తం విషయంలో ముఖ్యమైనదాన్ని దాచేసి మీకు అర్ధమైనదాన్ని మాత్రమే ఉటంకించడం వల్ల నేను మీలో పట్టిన తప్పు ఏమిటో మీకు అర్ధం కాలేదని తెలుస్తున్నది.

    అసలు మీకు ఆరవయేటనే రామభక్తి అలవాటు అయినా మీ చుట్టూ రాముడి గురించిన ప్రస్తావనలు ఉండటమే కదా దానికి కారణం!నేను మిమ్మల్ని "వాల్మీకి మీ కల్లోకి వచ్చి చెబితే రాముడి గురించి తెలిసిందా మీకు?" అని అడిగాను.దాని అర్ధం ఇది:వాల్మీకి అనే ఒక వ్యక్తి చెప్పిన కధ ఇప్పటివరకు నిలిచివుండి మనకు తెలుస్తున్నదీ అంటే ఇన్ని తరాల పాటు దాన్ని మోసుకొస్తున్న గురుశిష్యపరంపర వల్లనే కదా!

    అబ్రహామికి మతాలవాళ్ళు మన మతం మీద దాడి చేస్తున్నారన్నా "పోనిద్దురూ చేసుకోనివ్వండి!" అంటూ బ్రహ్మకుమారీలు గీతకి తప్పుడు అర్ధాలు చెప్తున్నారన్నా "పోనిద్దురూ చేసుకోనివ్వండి!" అంటూ నాలాంటివాళ్ళను వెనక్కిలాగడం దేనికని అడుగుతున్నాను మిమ్మల్ని.అది అర్ధం కాలేదని ఈ పోష్టు వల్ల తెలుస్తున్నది, అందర్నీ "పోనిద్దురూ!పోనిద్దురూ!" అంటూ పోతే వాళ్ళ సంఖ్య పెరిగి రేపటికి రాముడి గురించి చెప్పేవాడు ఒక్కడు కూడా మిగలకపొతే? అనే ప్రశ్నని అంత స్పష్టంగా అడిగినా మీకు అర్ధం కాలేదా - అత్తవారింట్లో కొత్త గురువుకి భక్తులై పెత్తనం చేస్తుంటే ఆత్మహత్య చేసుకున్న కోడలి గురించి మీరొక కధ రాశారు - అదైనా గుర్తుందా! మరి మెయిల్లో అంతా అర్ధం అయిందని ఎందుకు అన్నారు?

    మీరు ఒక విషయం చెప్పారు.గతంలో మీరు కూడా వాళ్ళతో వాదించానని అన్నారు. అంటే, మీకూ అసంతృప్తి ఉన్నదనేకదా అర్ధం?మీ శైలీ ధోరణీ ఎలా ఉంటుందో తెలియనిది ఎవరికి?మీరు ఒకసారి అంటీముట్టనట్టు చెప్తారు, వినకపోతే వాళ్ళ ఖర్మ అని వదిలేస్తారు - అందరూ మీలాగే ఉండాలా?ఉంటారా!మీరూ హిందువే, నేనూ హిందువే.మన మతాన్ని వేరేవాళ్ళు అవమానిస్తుంటే వాళ్ళమీద పోట్లాడే మనవాళ్ళని వెనక్కి లాగడం తెలివితక్కువతనం కాదా?

    అసలు మెయిల్లో అర్ధం అయిందని చెప్పాక అంతటితో వదిలెయ్యాలి.అలా కాకుండా ఈ పోష్టు వేశాక నాకు విషయం తెలియజెయ్యాలి.తప్పు మీద తప్పు చేస్తూ మర్యాదను అతిక్రమిస్తున్నారు - శ్యామలీయం, నన్ను మరింత రెచ్చగొడుతున్నారు!"idiotic fellow" అనేది మన మతాన్ని అవమానిస్తున్నవాళ్ళ మీద పోట్లాడేవాళ్ళని వెనక్కి లాగడం అనే తెలివితక్కువతనానికి సంబంధించిన gendral rhetoric! అలా ఎవరు ప్రవర్తించినా వాళ్ళకి వర్తిస్తుంది. దాన్ని మీరు వ్యక్తిగతంగా తీసుకోవడం వల్లనే మీకు మనస్తాపం కలుగుతున్నది.ఇంతవరకు మీతో మర్యాదగానే వ్యవహరించాను.ఇంత ఓపిగ్గా వివరించి చెప్పినా అర్ధం కాకపోతే నేను చెయ్యగలిగింది లేదు.నాలో తప్పులు పట్టడం మీవల్ల కాదు.ప్రతి మాటా లెక్క ప్రకారమే వాడతాను.నా లెక్క ఏమిటో అర్ధమైతే సంతోషం!

    ఒకసారి పోట్లాటకి దిగాక లక్ష్యం పూర్తి కాఉండా వెనక్కి తగ్గేది లేదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు. నా వ్యాఖ్యా తదనంతర పరిణామంగా మీతో అనవసర వివాదమూ అనేకులు గమనించే ఉండవచ్చును. నా వివరముగా వచ్చిన ఈటపాకు మీ స్పందనతో ఇంకా ఈ విషయానికి ముగింపు చెప్పటం మంచి దనుకుంటున్నాను.

      తొలగించండి
    2. నా వివరణగా... అని చదువుకొని గోర్తాను. మొబైల్ టైపో అన్నమాట.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.