8, సెప్టెంబర్ 2019, ఆదివారం

సరిసరి నీవంటి సత్పురుషునకు


సరిసరి నీవంటి సత్పురుషునకు
తరుణమిదే నను దయజూచుటకు

భయపీడితుడగు వానరవిభునకు
జయము చేకూర్చిన సత్కరుణ
రయముగ నాపైన రానిచ్చుటకు
జయరామ యిది మంచి సమయము

పొలికలనిని నీ ములుకుల నొచ్చి
యలసిన శాత్రవు తలగాచినది
తులలేనిదిరా దొర నీకృప యిక
జలజాక్ష నాపైన సారించు

పాదదాసు నొక బ్రహ్మగ జేసి
యాదరించిన గొప్ప దగు కరుణ
వేదన లడగించి వేగ నన్నేలుట
వేదవేద్య మంచి విషయము