28, సెప్టెంబర్ 2019, శనివారం
హరిని పొగడితే కాని యాత్మ కేది తృప్తి
హరిని పొగడితే కాని యాత్మ కేది తృప్తి
హరిభక్తు డైతే కాని యబ్బుటెట్లు ముక్తి
హరిని విడచి యెవ్వారి నాశ్రయింతు వయ్య
హరినాశ్రయించుకొని యఖిలవిశ్వముండ
హరిని విడచి గొలుతువా పెఱదైవములను
పొరబడితే దిద్దుకొనక బుధ్ధికేది తృప్తి
ససురాసురగంధర్వజనపూజితు డైన
అసమానుడైన హరి యందు నిలువకుండ
మసలునా భిన్నమైన మార్గము లందున
మసలినదా మరలకుండ మనసుకేది తృప్తి
ప్రేమమీఱ శ్రీహరిని పిలిచి మురియకుండ
రామభజన చేయక రసన కేది తృప్తి
శ్యామలాంగునకు ఫలమును సమర్పించి కాక
ఏమి చేసిన సుజనున కెక్కడిది తృప్తి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.