24, సెప్టెంబర్ 2019, మంగళవారం

ఒక్కసారి రామా యని చక్కగ పలికితే పెక్కుమార్లు పలుకగ మక్కువ కలుగు


ఒక్కసారి రామా యని చక్కగ పలికితే
పెక్కుమార్లు పలుకగ మక్కువ కలుగు

నిక్కముగ చవులూరుచు దక్కు రసనంబునకు
చక్కని యమృతపు విందు సజ్జనులార
వెక్కసము కాకుండును వేయి జన్మములకును
మిక్కిలిగ చెప్పనేల నొక్కసారి పలుకరే

ఒక్క రావణుని జంప నుదయించెనా హరి
చక్కగ ధర్మమును గూర్చి సజ్జనులార
మక్కువతో బోధింప మహికరుదెంచె గాని
యొక్కసారి రామనామ ముత్సహించి పలుకరే

మక్కువతో నీ మంత్ర మొక్కసారి పలికితే
చక్కబడును చిక్కులెల్ల ‌సజ్జనులార
చక్కగ భవతారకమై జనుల నుధ్ధరించెడి
యక్కజమగు రామ మంత్ర మొక్క‌సారి పలుకరే

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.