9, సెప్టెంబర్ 2019, సోమవారం

రామనామమే రామనామమే


రామనామమే రామనామమే
రామబంటు సర్వస్వము రామనామమే

లంకపై కెగిరించెను రామనామమే
జంకక సింహికను చీల్చె స్వామినామమే
లంకిణి నణగించినది రామనామమే
లంక తగులబెట్టినది రామనామమే

రమణి సీతను జూపె రామనామమే
రమణి నూరడించినది రామనామమే
రమణి యనుగ్రహము నిచ్చె రామనామమే
సమరవిజయ మిచ్చినది స్వామినామమే

రామనామ మిచ్చె బలము రామబంటుకు
రామనామ మిచ్చె జయము రామబంటుకు
రామనామ మిచ్చె యశము రామబంటుకు
రామనామ మిచ్చె వరము రామబంటుకు