24, సెప్టెంబర్ 2019, మంగళవారం
రవ్వంతయు చింత కలదె రాము డుండగ
రవ్వంతయు చింత కలదె రాము డుండగ
నవ్వుచు నాతండ్రి నన్నేలు చుండగ
ఇవలనవల నావా డినకులేశు డుండ
భవతారకము వాని భజనయు నాకుండ
పవలురేలు నాతని వాడనై యుండగ
నెవరెవరి దయయైన నేల నాకు రాముడుండ
ఇదికోరి యదికోరి నిటునటు తిరిగువారి
కుదితమై యుండుగా కుర్వి నెన్నొ చింతలు
నెదలోన నే చింత కదలాడును జనులార
వదలక నేనాడును మదిని నా రాముడుండ
కలుగునో కలగవో కలుములవి నాకేమి
తొలగునో తొలగవో దురితములు నాకేమి
నిలుచునో నిలువవో నేలపై నాపేరు
కలగ నాకేమిటికి కలనైన రాముడుండ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
మీ పోస్ట్ కు సంబంధం లేదు గానీ నా ధర్మసందేహాన్ని తీర్చండి.
రిప్లయితొలగించండి----------------
** అగ్నిమీళే పురోహితం (ఋగ్వేదం)
** మా నిషాద (వాల్మీకి)
-----------------
ఈ రెండింటిలోనూ ఏది మొట్టమొదటి శ్లోకం?
(నిన్న ఒక బ్లాగర్ గారు వాల్మీకి చెప్పినది "సంస్కృత సాహిత్యంలో" మొట్టమొదటి శ్లోకం అన్నారు. అందువల్ల అడుగుతున్నాను)
ఋగ్వేదంలోనిది అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజమ్ హోతారం రత్నధాతమమ్ అన్న ఋక్కు. వాల్మీకిరామాయణం లోనిది మానిషాద శ్లోకం. వాల్మీకి చెప్పినది సంస్కృత సాహిత్యంలో మొట్టమొదటి శ్లోకం. ఋక్కులు శ్లోకాలు కావు కదా.
తొలగించండిఅజ్ఞానం అజ్ఞానం, ఏమరుపాటున్నూ (నాది).
తొలగించండిధన్యవాదాలు.
పంచభూతములలో అంశముల నిష్పత్తిని వివరిస్తూ "పంచీకరణమను" జా(జ్ఞా)నపదమైన పాటను నా మాతామహి పాడగా వినిన జ్ఞాపకం. దయచేసి మీసంపాదనలో ఉన్న ప్రచురించిన ఆనందం
రిప్లయితొలగించండిశ్రీరామమూర్తి గారు, మన్నించండి. నా దగ్గర ఆ పాట లేదు. మీకు ఆ పాట పల్లవి తెలిస్తే ఇక్కడ వ్రాయండి. ఎవరికైనా తెలుసునేమో ప్రయత్నిద్దాం.
తొలగించండి