8, సెప్టెంబర్ 2019, ఆదివారం

ఏమేమో కావావాలని అనిపించును నాకు

ఏమేమో కావావాలని అనిపించును నాకు
ఏమేమో చేయాలని అనిపించును నాకు

ఈ లోకము నాదేనని అనిపించును నాకు
ఈ కాలము నాదేనని అనిపించును నాకు
ఈ లోకము ఈ కాలము ఆ రాముడె నాకు
మేలుగా నా కిచ్చె ననిపించును నాకు

ఇంతవరకు దాగియున్న ఆనందము నాకు
స్వంతము కావాలని అనిపించును నాకు
అంతులేని వింతలన్ని ఆ రాముడే నాకు
సంతసముగ నాకిచ్చె ననిపించును నాకు

ఆ రాముడె నాలోక మనిపించును నాకు
ఆ రామునె  పొగడాలని యనిపించును నాకు
ఆ రాముడు చాలునని యనిపించును నాకు
ఆ రామునె చేరుకొందు ననిపించును నాకు