29, సెప్టెంబర్ 2019, ఆదివారం

రాముడా నీమహిమ నేమెఱుగుదు నయ్య


రాముడా నీమహిమ నేమెఱుగుదు నయ్య
సామాన్యుడను శక్తి చాలని వాడ

పలుకాడి నీప్రతిభ భావింప నేర్చుటకు
అల హనుమన్నకే యది తగె నయ్య
బలపరీక్ష సేసి సంభావించ నేర్చుటకు
నిలపైన సుగ్రీవునకే చెల్లు నయ్య

పోరున నీగొప్ప నారసి మెచ్చుటకు
నా రావణునకే యది తగు నయ్య
కారుణ్యము నెఱిగి నీఘనత సంభావించ
సారణునకు శుకునకే సాధ్యమౌ నయ్య

వాసిగ నీయంతేవాసిగ నుండుటకు
ఆ సౌమిత్రికే యది తగునయ్య
నీ సేవలో గడిపి నీ తత్త్వ మెఱుగగ
భూసుత సీతమ్మకే పొసగెడు నయ్య

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.