14, సెప్టెంబర్ 2019, శనివారం

ప్రేమమయ దివ్యాకృతి రామాకృతి


ప్రేమమయ దివ్యాకృతి రామాకృతి సం
గ్రామవేళ రుద్రాకృతి రామాకృతి

వీతరాగద్వేషాకృతి విమలధర్మాకృతి
భూతలోక హితాకృతి పురుషోత్తమాకృతి
సీతారామాకృతి శృంగారరసాకృతి
చేతోముదము మాకు శ్రీరామాకృతి

కౌసల్యాపుత్రాకృతి కమనీయాకృతి
దాసపోషదయాకృతి దంభహీనాకృతి
వాసవాదినుతాకృతి పరబ్రహ్మాకృతి
భాసురమగు మాకు వరదరామాకృతి

దశరథతనయాకృతి ధ్యానగమ్యాకృతి
దశముఖదళనాకృతి ధర్మరక్షాకృతి
విశదమితదయాకృతి వీరరాఘవాకృతి
నిశలుపవలు రక్షనిచ్చు రామాకృతి