మాకు సర్వస్వమై మారాము డున్నాడు మీ కెవ్వరున్నారు మీరె చెప్పుడయ్య |
|
కర్మసముఛ్ఛయము నందు కల లబ్ధి సున్న కర్మఫలము దారితీయు కర్మములకు దుర్మానములు బాపి నిర్మలత్వము గూర్చి కర్మవిముక్తుల జేయ గలడా మీదేవుడు |
మాకు |
లేనిపోని కొంగ్రొత్త జ్ఞానమార్గములు వచ్చె దేని కెంత ఫలితమన్న దెలియరాదు మీ నిజతత్త్వమందు మిమ్ము నిలుపలేని వానిచే దెలుపబడు వాడెట్టి వాడగును |
మాకు |
ఎవడో ఒకడిని దేవు డితడని నమ్మి కొల్చితే చివరకు దక్కునదేమొ చెప్పరాదు భవరోగము మాన్పు వైద్యుడెవ్వడో వాని దవులు కొన్న మీకు ఫలము దక్కును గాని |
మాకు |
28, డిసెంబర్ 2016, బుధవారం
మాకు సర్వస్వమై మారాము డున్నాడు
27, డిసెంబర్ 2016, మంగళవారం
ఆలసించరాదు రాము నాశ్రయించరా
ఆలసించరాదు రాము నాశ్రయించరా కాలగతి యెటులుండునొ కనలేమురా |
|
కొఱగాని చదువులతో కొల్లబోయె బాల్యము నెఱజాణ యిచ్చకములు నెట్టెను యౌవనము తఱచు కాసులగోల తరిగించె నడివయసు తఱుముడువడ నాయె కాలసర్పము చేత |
ఆల.. |
కనులు హరినిజూడగ కలువరించలేదు మనసులోన నాటలేదు మాధవుని కథలు తనువుగూర్చి నేటికి తహతహలు పుట్టగ పనవుదువా హరిహరి యని పరిహసించను |
ఆల.. |
పదిజన్మల నెత్తినను బ్రతికెడు తీరిట్టిదే పదేపదే విషయంబుల భావించి చెడుటయే వదలక శ్రీరాముని పదములాశ్రయించిన వదిలిపోవు చెడుగు రామ వాల్లభ్యము చేత |
ఆల.. |
పట్టె శ్రీరామవిభుని పాదములను హనుమ
పట్టె శ్రీరామవిభుని పాదములను హనుమ పట్టుమని బ్రహ్మపదము ప్రభువొసగెను వినుమ |
|
ఒక కోతికి దక్కినదే యున్నతమగు పదము యకళంకభక్తి కది యద్భుతమగు వరము సకలజీవరాశులకు సముడు శ్రీరాముడు వికసరోరుహనేత్రుడు విభీషణవరదుడు |
పట్టె |
అతడు నవవ్యాకరణము లభ్యసించినాడు అతడు నవనిథులగుట్టు లన్ని యెఱిగినాడు అతడు శ్రీరామచంద్రు నాశ్రయించినాడు అతడు లోకారాథ్యు డగుచు వెలసినాడు |
పట్టె |
శ్రీరాముని శుభనామము చెలగు నెల్ల తావుల ఆరూఢిగ సజలనయను డగుచు వ్రాలు మారుతి ఈరేడు లోకముల లేరతనికి సాటి చేరబిలచి బ్రహ్మనుగా చేసె రాముడందుకే |
పట్టే |
లేబుళ్లు:
రామకీర్తనలు,
రామాయణకీర్తనలు
ఏమి చేసేదయా యింత సామాన్యుడను
ఏమి చేసేదయా యింత సామాన్యుడను రాముడా దారి చూపరాదటయ్య |
|
బాగొప్ప వేదాంతపరిభాష నెఱుగనే నీ గొప్పదనమది నేర్పేనో ఆ గజిబిజి వేదాంత మబ్బకున్నను నే గొంటి నీభక్తి నిజమిది నిజము |
ఏమి |
ఏ గురువును నొకమంత్ర మీయనే లేదే సాగి యొకదీక్షగొని జపముచేయ యోగీశ్వరేశ్వర యొక్క నీ నామమే నా గతి యని నమ్మి నానిది నిజము |
ఏమి |
యేది మంచి దేది చెడుగొ యెంచగా లేనే యేది దారి యని నేను యెంచితిని శ్రీదయితుడా దీన చింతామణీ నీదు పాదములే చక్కగ పట్టితి నిజము |
ఏమి |
దేవతలున్నారు దేనికి
దేవతలున్నారు దేనికి నీకు నాకు కావలసిన విచ్చి వారు కదలిపోయేరు |
|
ఒక్కొక్క కోరిక పుట్ట నొక్కక్క దేవత నెంచి యొక్క ప్రొద్దులు పురాణోక్తస్తోత్రంబులు చక్కగా వ్రతములు సాగి మంత్రదీక్షలును నెక్కటిభక్తి ఘటించి యెచటికి చేరెదరు |
దేవత |
వారిచ్చునవి యెంత వరకు నిత్యంబులు వారిచ్చు వరముల వలచి తపించినను వారిజాక్షియొ బలమొ బంగారమో యెంచి కోరగలము గాని ముక్తి కోర వీలగునె |
దేవత |
వారికి నైన నాపదలు వచ్చుచు నుండును వారు నారాయణుని పదము లంటెదరు ధారుణి నున్న మనకు దశరథరాముడై కోరిన ముక్తి నీయ కొలువాయె శౌరి |
దేవత |
18, డిసెంబర్ 2016, ఆదివారం
రామమంత్రమునకు సాటిరాదు వేరుమంత్రము
రామమంత్రమునకు సాటిరాదు వేరుమంత్రము రామదేవునకు సాటిరాడు వేరుదైవము |
|
సప్తకోటి మంత్రములకు సారమైన మంత్రము గుప్తము కా దెల్లవారు కోరదగిన మంత్రము లిప్తలోన జ్ఞానజ్యోతి వ్యాప్తి చేయుమంత్రము శప్తుల ఘనపాపులను చక్కజేయు మంత్రము |
రామ |
మునిజనసంభావితశుభమూర్తి శ్రీరాముడు వనజభవభవవాసవవినుతమూర్తి రాముడు ఘనభవసాగరము మీద గట్టినౌక రాముడు జనార్దనుడు నారాయణస్వామి శ్రీరాముడు |
రామ |
కోరిన లౌకికము లీయ కొల్లలా దేవతలు వారి నుపాసించ కావలసినన్ని మంత్రములు మీరు మోక్షార్ధులైన మీకిదియే మంత్రము మీరు మోక్షార్ధులైన మీకితడే దైవము |
రామ |
15, డిసెంబర్ 2016, గురువారం
బడయుడు శుభములు
బడయుడు శుభములు బడయుడు సుఖములు బడయుడు శ్రీరామచంద్ర భజనంబున |
|
బడయుడు రాముడు పరమాప్తుడై యుండి పెడమోము కాక ప్రేముడితోడను నడిగిన వన్నియును నమరించు చున్నాడు కడుభక్తులరైయుండి బడయుడన్నియును |
బడయుడు |
బడయుడు రాముడు పరమగురుండై యుండి యడగించి సందియంబులనెల్ల కడుయోగ్యులను జేయు జ్ఞానమిచ్చుచున్నాడు తడయక మీరతని చేరి తత్త్వమెఱుగుడు |
బడయుడు |
అడిగడిగో రాముడు మన కందరకు మోక్షము నిడ సంసిధ్ధుడై యిదిగో పిలచె వడివడిగ పరమాత్ముని భావించి మించరే బడయ మీ కింకేమి వలయునో చెప్పరే |
బడయుడు |
14, డిసెంబర్ 2016, బుధవారం
కొలిచి నీకు నేనిచ్చుకొన నేమున్నది
కొలిచి నీకు నేనిచ్చుకొన నేమున్నది తలచి నీవిచ్చినవి తప్ప నాకడ లేవు |
|
తనువా యిది నీవు దయతో నిచ్చినది మును పిట్టి వెన్నో ముదమార గొనుమని వివిధములను నాకిచ్చి నీ పనులను నావలన బాగుగ గొంటివే |
కొలిచి |
మనసా యిది నీవు మంచివర్తనము లను దాని లోపలను పొదగి తనివార నది నిన్ను తద్దయు వేడుక గొనియాడ నిత్యము వినుచుందువే |
కొలిచి |
నను నీదు ప్రతిబింబ మనియందువు నా దని నొకడెన్న దగునా రామ నను నేను నీలోన కనుచుందు గావున కొనుమని నన్నిచ్చు కొనువాడ నంతియె |
కొలిచి |
13, డిసెంబర్ 2016, మంగళవారం
చిన్నవారు పెద్దవారు చేరి మ్రొక్కుడీ
చిన్నవారు పెద్దవారు చేరి మ్రొక్కుడీ మీ కున్న చింతవంత లన్నియు వీడుడీ |
|
ఇతని పేరు చెప్పినంత నెల్ల లోకనాయకులు నతిబలశాలుర నసురుల తుళువల నితడు చంపెనని యెంచి యెంచి వేడ్కతో నతులు చేయుదురు చాల నమ్రులై నిలచి |
చిన్న |
ఇతని పేరు చెప్పినంత నింతింత యనరాక నతిశయించెడు భక్తి నందరు సజ్జనులును యితని సద్గుణముల నెంచి నెంచి వేడ్కతో నతులు చేయుదురు చాల నమ్రులై నిలచి |
చిన్న |
ఇతని పేరు చెప్పినంత యెట్టిపాపములైన చితికి నుగ్గైచను చేరునెల్ల శుభములును యితడిచ్చు మేళుల నెంచి యెంచి వేడరే యతులితమగు మోక్షమందించు రాముని |
చిన్న |
మాయలేమి చేయలేదు
మాయలేమి చేయలేదు మహిమలేమి చూపలేదు మాయయ్య రామయ్య మరి నీతి తప్పలేదు |
|
ఒరులేల శివుని యుత్తమ ధనువును మరి యెత్తలేరైరొ మాకే మెఱుక గురువుల యనుమతి గొని రఘువరుడు కరముల గొన నదె ఖండము లాయె |
మాయ |
తానై చనలేదు దండకలో నుండ తానై దనుజుల తాకబోవడు వారె పూని పదునాల్గువేలు బొబ్బలిడుచు వచ్చి వాని నెదిరించి నంత భస్మమైరంతె |
మాయ |
పనిగొని రావణు డనువాడు సీతను గొనిపోయె మ్రుచ్చిలి కొరవితోడ తనకేల తలగోకుకొన బుద్ధి కలిగెనో కనగ భూభారమెల్ల కరిగిన దంతె |
మాయ |
నీ విచ్చే దిచ్చితివి
నీ విచ్చే దివ్చితివి నేనడుగ కుండినను నే నీయగలిగినది నీకిచ్చితినా |
|
గడచిన పలుజన్మములును కరుణ నందించితివి చెడు వేళలందు రక్షించినావు నీవు జడతతో నీప్రేమ సామ్రాజ్యసుఖము విడచి ప్రకృతి నెన్ను వెంగళిని నేనైతి |
నీ విచ్చే |
ఏనాటి కైన నేను నీవాడ నగుదునని నీ నమ్మకము కాని నేనైతే కటకటా మానక ప్రకృతికాంత మరులలో జిక్కితిని నీ నామమే మరచు నీచుడ నేనైతినే |
నీ విచ్చే |
ఇపుడు నీపైన భక్తి యినుమడించినది నాకు విపరీతమై తోచు వెనుకటిబ్రతుకంతయు యపరాథములు సైచి యాదరించవే తండ్రి తపనదీర్చి కాపాడక తప్పదయ్య రామయ్య |
నీ విచ్చే |
(గమనికః తేదీ. 2016-07-21న వచ్చిన ఈ కీర్తన ఎందుకో వెలువడలేదు! ఇప్పుడు గమనించి ప్రచురించటం జరుగుతున్నది.)
నేర్తునో నేర్వనో నిను నేను పొగడగ
నేర్తునో నేర్వనో నిను నేను పొగడగ నార్తి దీర్తువు కద నటులైన నిటులైన |
|
వేరుపడక నిన్ను వెంబడించుచు దోచు శ్రీరమణీమణి చెలగిపొగడు నట్లు నీరూపముల గూర్చి నీనామముల గూర్చి నేరిచి పలుకాడ నేనెంత వాడను |
నేర్తునో |
వీగక నీయెడద విహరించి మురిపాలు సాగించుకొను లచ్చి చక్కగా నెఱిగిన నీగుణములను గూర్చి నీదు కరుణను గూర్చి సాగి వచింపగ సరిపడు వాడనా |
నేర్తునో |
కాలమే నీవైన కడగి తానె నీవై మేలుగ చరియించు శ్రీలక్ష్మి వలెను నీలీలలను గూర్చి నీతత్త్వమును గూర్చి చాలుచాలు రామహరి చర్చించు వాడనా |
నేర్తునో |
28, నవంబర్ 2016, సోమవారం
మనసు నిలకడలేని
మనసు నిలకడలేని మనుజుడ నైతి నా మనసు నీపై నిలచు మాట యెక్కడిది |
|
నిదురబోయెడు వేళ నీవు తలపున తోచ నిదురలేచిన వెనుక నిన్ను పూజింప మదిలోన నిశ్చయము మానక చేయుదు నది సంతసము గూర్చ హాయిగా నిదురింతు |
మనసు |
నిదుర ముందటి బుద్ధినిశ్చయం బంతయు నిదురలో సడలుట నిత్యకృత్యమ్మై అదుపులేని వాంఛ లమితమోహంబును మదిని ముప్పిరిగొన మొదలౌను దినచర్య |
మనసు |
అదిచేయు చిదికోరు చటునిటు తిరుగుచు ఉదయమాదిగ దినమూరక బుచ్చి హృదయంబులోన క్షోభింతు రామయ్య నిదురబోయెడు వేళ నీవు తలపున తోచ |
మనసు |
(గమనికః తేదీ. 2016-07-21న వచ్చిన ఈ కీర్తన ఎందుకో వెలువడలేదు! ఇప్పుడు గమనించి ప్రచురించటం జరుగుతున్నది.)
23, నవంబర్ 2016, బుధవారం
మరల నింకొక మాట
మరల నింకొక మాట మనవిచేసెడు లోన మరలిపోతివి నిన్న మంచి స్వప్నము లోన |
|
చిరునవ్వు వెన్నెలలు చిక్కగా కురిపించి మురిపించి ఎన్నెన్నొ ముచ్చటలు పలికి నిరుపమానం బైన నీదయలు చిలికి మరి నాదు పొగడికలు మన్నించి వినుచు |
మరల |
నా కడకు వత్తువు నన్ను మన్నింతువు నీ కడకు మరియింక నేను వచ్చెదనని వేడుక మీరగ వినయంబుతో నిన్ను వేడగ నెంచి నే విన్నవించగ నుండ |
మరల |
ఎన్నాళ్ళ నుండియో నన్నెఱుగుదు వీవు అన్నియు నెఱుగి నాయాశ నీవెఱురగవా ఇన్ని యాశలు దీర్చి యీయాశ దీర్చవా యన్న మాటను నే నడుగ బోవుచునుండ |
మరల |
(గమనికః తేదీ. 2016-07-21న వచ్చిన ఈ కీర్తన ఎందుకో వెలువడలేదు! ఇప్పుడు గమనించి ప్రచురించటం జరుగుతున్నది.)
21, నవంబర్ 2016, సోమవారం
హరిమ్రోల నిలచు వారందరు నొకటే
హరిమ్రోల నిలచు వారందరు నొకటే పరికింప భేద మావంతయు లేదు |
|
తాపము లోర్వక దరికి జేరెడు వారు శ్రీపతినిజతత్త్వజిజ్ఞాసువులు ఆపన్నులును నర్థార్థులు జ్ఞాను లా పరమాత్ముని కందరు నొకటే |
హరి |
సురలు సిధ్ధులు వసువులు గంధర్వులు నరుగరుడోరగకిన్నరవరులు నిరుపమకరుణాన్వితుడై యుండెడు హరిశుభదృష్టికి నందరు నొకటే |
హరి |
వామన నరహరి పరశురామ హరి శ్రీ రామకృష్ణాది శుభనామములను ప్రేమమీఱ భావించు భాగవతు లా మాధవునకు నందరు నొకటే |
హరి |
మ్రొక్కుదురో మానుదురో
మ్రొక్కుదురో మానుదురో నిక్కువంబుగ మీరే చక్కగా నిశ్చయించి చనుడొక్క రీతిని |
|
ఇక్కడ యీ భూమిపైన దక్కిన జీవితమే చక్కనిదిది మా కిదే చాలును ఎక్కడి స్వర్గమో యేదేవుడో యేల మక్కువ లేదందురా మంచిది యటులే |
మ్రొక్కుదురో |
కారు బంధువులు సిరులు కావు సుమా రక్ష పేరినకృపగల విభుని యట్లు దారుణభవవార్ధిని తరియించ గోరిన శ్రీరామచంద్రునే చింతించ వలెనని |
మ్రొక్కుదురో |
జీవుడు స్వతంత్రుడు చెడను బాగుపడను దేవుడు మీబాగుకోరు తెలియుడు కావలసినదేమో గట్టిగా యోచించి పోవుడొక్క విధమున బుధ్ధిశాలురై |
మ్రొక్కుదురో |
పరమపురుష నీ భక్తుడ
పరమపురుష నీ భక్తుడ నేనని నరులు తిట్టితే నగుబాటేమి |
|
నే నిటు నమ్ముట నా నిర్ణయ మిది నానాటికి నా నమ్మకము మానగు చున్నది మరి నీ దయచే దానికి నితరుల దయయేమిటికి |
పరమ |
దయచూపించెడు ధర్మప్రభుడవు భయములను వారింతువు రయమున భవసంగ్రామరంగమున జయమును నాకు సమకూర్చెదవు |
పరమ |
సమకూర్చెదవు సకలార్థంబులు భ్రమలను బాపి పాలింతువు ప్రవిమలనీలోత్పలశ్యామ రామ చివరకు నీలో చేర్చుకొందువు |
పరమ |
16, నవంబర్ 2016, బుధవారం
కథ: వాగుడుకాయ
అబ్బాయీ వట్టి వాగుడుకాయలాగా ఉన్నావే? నీ నో రసలు మూతబడదా? అని ఎవరో అడిగారు.
ఆయన పేరు గుర్తు లేదు.
ఆయన ముఖమూ గుర్తులేదు.
ఆ మాట మాత్రం అతనికి బాగా గుర్తుండి పోయింది.
ఐతేనేం, తన నోటిని అదుపులో ఉంచుకోవటం అతని వల్ల కాలేదు.
స్కూలు పిల్లలంతా అతనికి రాళ్ళడబ్బా అని పేరు పెట్టేశారు.
ఐనా అతడి నోరు మూతపడటానికి చచ్చినా ఒప్పుకోలేదు.
కాలేజీ స్టూడెంట్లందరూ ఛాటర్ బాక్స్ అని ముద్దు పేరు పెట్టారు.
బంధువులెప్పుడో వాగుడుకాయ అన్న పేరు ఖాయం చేసేశారు.
ఐతేనేం? నో రెంత ధాటీగా ఉండేదో, చదువుకూడా అంత ధాటీగానే నడిచేది మరి.
చిత్రం ఏమిటంటే, అతడికి దొరికిన ఉద్యోగం కూడా వాగటమే.
అంటే లెక్చరర్ అన్నమాట.
పెళ్ళిచూపుల్లో అమ్మాయి ముందు ఆట్టే వాగకు అని అమ్మ వార్నింగ్ ఇచ్చింది.
అవసరం ఐతే కాని నువ్వు మాట్లాడాల్సిన పనేమీ లేదు అని నాన్నగారు రూలింగ్ ఇచ్చారు.
అమ్మాయితో ఏమన్నా మాట్లాడతారా అని పెళ్ళికూతురు తండ్రి అడగ్గానే అమ్మా, నాన్నా, అన్నయ్యా కూడా కోరస్ పాడేసారు అబ్బెబ్బే అవసరం లేదండీ అని.
ఐనా అమ్మాయితో మాట్లాడనే మాట్లాడాడు.
అదృష్టం బాగుండి ఆ ఆమ్మాయి ముందు మొగమాటం అడ్దం రావటమూ, ఆ అమ్మాయి ఆట్టే అవకాశం ఇవ్వకపోవటమూ పుణ్యమా అని గండం గట్టెక్కింది లెక్చరర్ గారికి.
బావగారు మంచి మాటకారి అంటున్నారు బావమరదులు.
ఒక రోజు భార్యామణి క్లాసుతీసుకుంది.
మీ లెక్చర్లేవో మీ స్టూడెంటు కుర్రాళ్ళ ముందు దంచుకోండి, అందరి ముందూ అస్తమానం అదేపనిగా మాట్లాడుతుంటే నాకు చిన్నతనంగా ఉంది అని.
ఎందుకు చిన్నతనం? ఎవరికైనా తెలియకపోతే చెబుతున్నాననేనా? అసూయపడుతున్నారల్లే ఉంది అని అన్నాడు.
అసూయా లేదు అప్పడాలూ లేవు. అంతా వాగుడుకాయ మహాప్రభో అంటున్నారు. తగ్గండి అంది చిరాగ్గా సతీమణి.
వట్టి ఇడియట్స్ అని ఉడుక్కుని తనకు ఎంత పెద్ద పేరుందో తన సత్తా ఎటువంటిదో తనకు ఎలాంటి ఎలాంటి పెద్దవాళ్ళ ప్రశంసలు వచ్చాయో అంతా వివరంగా ఆమెకు ఒక లెక్చరు వేసాడు.
మహాప్రభో చాలు చాలు వదలండి అనేసి ఆమె మధ్యలోనే లేచి చక్కాపోయింది.
పీహెడీ అంటారే అది కూడా అయ్యింది.
ఇప్పుడు అతడు పెద్ద ప్రొఫెసర్.
ఎంత బాగా మాట్లాడతారో అని పేరు పైగా.
ఇప్పుడు ఎవరెవరో పిలుస్తూ ఉంటారు. ఎవేవో పెద్దపెద్ద ఉపన్యాసాలు దంచుతూ ఉంటాడు.
పేరు పెరుగుతోంది.
సన్మానాలూ గట్రా జరగటం మామూలైపోయింది.
పుస్తకాలూ రాయటం మొదలు పెట్టాడు.
పేరున్నాయన పుస్తకం వ్రాస్తే పెద్దపెద్ద సభలు చేసి మరీ పొగుడుతారు.
తమాషా ఏమిటంటే ఆ పొగిడే వాళ్ళల్లో దాదాపు ఎవ్వరూ ఆ పుస్తకాన్ని ఆసాంతం చదవనే చదవరు. కొందరు అక్కడక్కడా చదువుతారు. కొందరు ముందుమాటలూ వెనకమాటలు చదివి వాటితోనే పొగడ్తలబండి లాగిస్తారు. కొందరి తరపున వేరే వాళ్ళు ఎవరో చదివి ఉపన్యాసం కాని నోట్ కాని సిధ్ధం చేస్తారు కూడా అప్పుడప్పుడు. ఇలాంటి సభల్లో వినటానికి కూర్చునే వాళ్ళూ పిచ్చివాళ్ళు కాదు. స్టేజీమీది వాళ్ళంతా ఉపన్యాసంలో ఆ పుస్తకాలని చదివినట్లు నటిస్తే, స్టేజీ ఎదురుగా ఉన్నవాళ్ళంతా విన్నట్లే నటిస్తారన్నమాట.
ఆ మధ్యన ఎవరో ఉపన్యాసకేసరి అని కూడా అన్నారు.
కొంచెం వాగ్ధాటి తగ్గింది. వయస్సు మీద పడింది కదా.
రిటైరై నాలుగేళ్ళు దాటినా ఇంకా సభలూ సమావేశాలూ అంటూ తిరుగుతూనే ఉన్నాడు.
కొంచెం ఓపిక కూడా తగ్గింది. క్రమంగా తానై ముఖ్యం అనుకుంటే కాని అన్ని చోట్లకీ వెళ్ళటం తగ్గించాడు,
ఎన్నడూ లేనిది ఇంటి పట్టునే ఎక్కువ సేపు ఉండటం జరుగుతోంది.
ఇల్లంతా ఎంతో నిశ్సబ్దంగా ఉంటోంది.
ఉండదా మరి?
పెద్ద కొడుకు ఎప్పుడో అమెరికా చెక్కేసాడు.
చదువుకు సాఫల్యం అమెరికా ఉద్యోగమే అన్న సూత్రం మధ్యతరగతిలోనే స్థిరపడిపోయిందే, ఇంక కాస్త బాగానే ఉన్న అతడి ఇంట్లో వేరేగా ఎలా ఉంటుంది.
సంతానం అంతా మితభాషులు.
వాళ్ళకు ఆట్టే మాట్లాడే అవకాశం వాళ్ళ నాన్న ఎప్పుడన్నా ఇస్తే కదా అని బంధువర్గంలో ఛలోక్తి
ఇంట్లో రెండవకొడుకూ, కూతురూ ఉన్నా వాళ్ళ చదువులేమో తిరుగుళ్ళేమో. వాళ్ళలోకం వాళ్ళది.
భార్యామణి లోకం వేరే.
వయస్సు పై బడ్డాక ఆవిడ పూజలూ పునస్కారాలమీద పడింది.
నిత్యం వాటితోనే కాలక్షేపం.
ఇంకా ఏమన్నా ఖాళీ సమయం ఉంటే మేడమీది హాల్లో టివీలో ఇంగ్లీషు ఛానెళ్ళ షోలూ సినిమాలూ చూస్తుంది ఆవిడ.
ఇంటి పట్టునే ఉంటున్నా అతడికి ఎవరితోనూ ఆట్టే మాట్లాడటం కుదరటమే లేదు.
తన పుస్తకాలకు ద్వితీయముద్రణల గురించి పనిచేస్తూనో, వాళ్ళు వీళ్ళూ పంపిన పత్రాలూ పుస్తకాలూ పరిశీలిస్తూనో ఎక్కువసమయం కాలక్షేపం చేస్తున్నాడు.
ఎప్పుడన్నా ఎంచుకున్న సభలకు వెళ్ళినా కొంచెం సమయమే ఇస్తున్నారు.
అందులోనూ ఎంత లౌక్యంగా అనీ? పెద్దవారు, మీరు ఐదు నిముషాలు మాట్లాడితే అదే పదివేలు. అదే చాలు, మిమ్మల్ని అంతకంటే కష్టపెట్టం అని.
కొన్ని సభల్లో ఐతే, ఏదో ఆఖర్న హడావుడిగా ఒక నిముషం మీరు కూడా మాట్లాడండి అంటున్నారు.
మరికొన్ని సభల నిర్వాహకులు మరచిపోయినట్లు నటించి ఊరుకుంటున్నారు.
ఇంకా కొన్ని సభల్లో మొగమాటం లేకుండా అతడిని అసలు వేదిక మీదకు పిలవటమే లేదు,
నేనూ మాట్లాడే పక్షంలో ఐతేనే వస్తాను అంటే ఏదో సభకు పిలవటానికి వచ్చిన ఒక పెద్దమనిషి చిత్రంగా చూసాడు.
అన్న అమెరికా పోతే తమ్ముడు అమలాపురం పోతాడా?
చదువు పూర్తి అవుతూనే అతగాడూ అమెరికా వెళ్ళిపోయాడు.
ఏమాట కామాట చెప్పుకోవాలి. ఆ రెండో కొడుకే కాస్త నయం. ఉన్నంతలో వీలు చూసుకొని అప్పుడప్పుడూ తనతో కబుర్లు చెబుతూ ఉండే వాడు.
వాడు కూడా దూరం కాగానే మొదటి సారి నిజంగా దుఃఖం వచ్చింది.
రెండు మూడు నెలలు దిగులుతో నోరు బందు ఐనంత పని అయ్యింది.
గోరుచుట్టుపై రోకటి పోటు అన్న సామెతను సమయానికి చక్కగా గుర్తుచేసింది అర్థాంగి.
కూతురికి మంచి అమెరికా సంబంధం కుదిర్చింది.
కాబోయే అల్లుడు మంచి యోగ్యుడట. ఇలా ఎమ్మెస్ చేయగానే అలా మంచి జాబ్ కొట్టేయటమూ, చకచగా మెట్లెక్కేసి ప్రోడక్ట్ ఆర్కిటెక్ట్ ఐపోవటమూ కూడా జరిగాయట.
ఇదంతా ఏమీ నచ్చలేదు అతడికి.
అమ్మాయి కూడా అమెరికా పోతే ఎలా అని ఆక్రోశించాడు.
అమ్మాయి సుఖం చూడాలి కాని పిచ్చిపిచ్చి సెంటిమెంట్లేమిటీ అని భార్యారత్నం చాలా పెద్ద క్లాసు తీసుకుంది.
ముక్తాయింపు ఏమిటంటే, కుటుంబవ్యవహారాలన్నీ ఇన్నాళ్ళూ తనే చూస్తోంది కాబట్టి అంతా తనే నిర్ణయిస్తుందట.
మౌనంగా ఉండిపోయాడు.
ఏమీ తోచటం లేదు.
ఏమీ చదవాలనీ రాయాలనీ అనిపించటం లేదు.
ఎవరూ ఏ సభలకూ ఈ మధ్య పిలవటం లేదు.
ఇంట్లో తన సంగతి పట్టట్లేదు.
పిల్లలా దూరం.
దిగులు దినదిన ప్రవర్థమానం అవుతోంది.
కొంచెం జబ్బుపడ్డాడు.
అమెరికానుండి ఆదుర్ధా పడుతూ ఫోన్లమీద ఫోన్లు వచ్చాయి.
భార్యామణి పూజలూ వ్రతాలూ జోరుచేసింది.
ఒకసారి హాస్పటల్ దర్సనం చేసుకొని వచ్చాడు.
ఇంటి దగ్గర కొన్నాళ్ళు బెడ్ రెష్ట్ అన్నారు.
భార్యామణి ఒక నర్సును ఏర్పాటు చేసింది.
అందరూ ఉన్న ఒంటరి జీవితం అతడిది
విరక్తితో తన మీద తనకే జాలో అసహ్యమో మొత్తానికి అలాంటిదేదో కలిగింది.
కొంచెం కోలుకున్నాక అధ్యాత్మిక గ్రంథాలు చదవటం మొదలు పెట్టాడు.
అసలు పూజలూ వగైరా తానూ మొదలు పెడితే కొంచెం మనశ్శాంతిగా ఉంటుందని అనుకున్నాడు.
కాని ఎన్నడూ జీవితంలో వాటి జోలికి పోని తాను ఇప్పుడు అలా చేస్తే అంతా నవ్వుతారని అనిపించి ఆగాడు.
అందుకే భార్య కలెక్షన్‌లో ఉన్న గ్రంథాలతో మొదలు పెట్టి దీక్షగా చదువుతూ ఉన్నాడు.
ఒకరోజు ఏదో పుస్తకం కోసం భార్య చదువుకునే పుస్తకాల గదికి వెళ్ళాడు.
అక్కడ ఆమె చదువుకుంటూ ఉంది.
భర్తకేసి తిరిగి కనీసం చూడలేదు, పలకరింపు దేవుడెరుగు.
తనక్కావలసిన పుస్తకం తీసుకొని క్రిందికి వచ్చాడు తనగదికి.
ఒకటి రెండు గంటలు దాన్ని తిరగేసి తిరిగి పైకి వెళ్ళాడు ఆ పుస్తకాన్ని అరలో పెట్టెయ్యాలని.
భార్య ఇంకా చదువుతూనే ఉన్నట్లుంది.
ఎందుకో అనుమానం వచ్చింది.
కొంచెం పరీక్షగా చూసాడు.
ఒకటి రెండు సార్లు పిలిచాడు.
జవాబు లేదు.
దగ్గరకు వచ్చి కుదిపాడు భుజం పట్టి.
అలాగే ఒరిగిపోయిందావిడ.
స్థాణువైపోయాడు ఒక్క నిముషం పాటు.
ఎవరెవరో వచ్చారు ఊళ్ళో నుండీ, పొరుగూళ్ళ నుండీ. ఓదార్చి వెళ్ళిపోయారు.
పిల్లలూ వచ్చారు ఎకాయెకి అమెరికా నుండి. ఓదార్చి వెళ్ళిపోయారు.
నర్సుపిల్ల వచ్చింది. దయగల అమ్మగారు దయగల అమ్మగారు అంటూ ఏడ్చి వెళ్ళింది.
లంకంత ఇంటిలో ఒంటరిగా మిగిలి పోయాడు.
దినచర్య మారింది.
ఇప్పుడు పూజగదిలో తానే కూర్చుని పూజచేస్తున్నాడు.
అదీ వీలైనంత ఎక్కువసేపు చేస్తున్నాడు.
నర్సుపిల్ల ఎవరో వంటావిడను మాట్లాడిపెట్టింది.
ఆవిడ వండినది తినటం.
ఆవిడ కేది యిష్టమైతే అది చేస్తుంది.
మీకేం కూరలు యిష్టం, ఏ పచ్చళ్ళు యిష్టం లాంటి ప్రశ్నలు ఆవిడ ఎప్పుడూ వేయలేదు.
కొడుకులూ కూతురూ ఎంతో అభిమానంతో అగ్గగ్గలాడిపోతూ తరచూ ఫోన్ చేస్తూనే ఉంటారు.
ఎలా ఉందీ ఆరోగ్యం, సరిగా మందులు వేసుకుంటున్నారా అని ఎంతో ఇదిగా వాకబు చేస్తూ ఉంటారు.
ముక్తసరిగా అలాగే, అలాగే, వేసుకుంటున్నాను, బాగానే ఉంది అంటూ జవాబులు చెబుతూ ఉంటాడు.
వంటావిడకో మనవడున్నాడు.
మంచివాడు పాపం.
స్కూలుకు సెలవు వచ్చిన నాడు బామ్మతో పాటే వచ్చి భలే హడావుడి చేస్తాడు.
స్వయంగా తానే డాక్టరు దగ్గరకు తీసుకొని వెడతాడు.
ఒకరోజున డాక్టర్ దగ్గరకు వెళ్ళాలంటే డ్రైవర్ సమయానికి రాలేదు.
వంటావిడ మనవడు తానే ఇంటి యజమాని ఐనంతగా ఆ డ్రైవరుమీద మండిపడిపోయాడు.
అది చూస్తే ఎంత ముచ్చటేసిందో!
ఈ వేళ బామ్మతో ఫిర్యాదు చేస్తున్నాడు పిల్లాడు.
చూడు బామ్మా, తాత్తయ్యగారు పదిమాటలకు ఒక్క మాటే జవాబు చెబుతారు, అదీ అప్పుడప్పుడూ అని.
వంటావిడ కసురుకుంది. ఒరే, నువ్వైతే వాగుడుకాయవి. అందరూ నీలాగే ఉంటారా అని.
చప్పున గుర్తుకు వచ్చింది.
అబ్బాయీ వట్టి వాగుడుకాయలాగా ఉన్నావే? నీ నో రసలు మూతబడదా? అని ఎవరో అడిగారు.
ఆయన పేరు గుర్తు లేదు.
ఆయన ముఖమూ గుర్తులేదు.
ఆ మాట మాత్రం బాగా గుర్తుండి పోయింది.
చాలా కాలం తరువాత పెదవులమీదకు చిరునవ్వు వచ్చింది.
(గమనిక: ఈకథను 2014-11-10న ఈమాట పత్రికవారికి పంపాను. 13వ తారీఖున వారు దీనిని ప్రచురణార్హం కాదని నిర్ణయించినట్లుగా వారు నాకు తెలియజేసారు. ఈరోజున అప్రచురితంగా ఉన్న టపాలను పరిశీలిస్తుంటే ఇది కనిపించింది. దీనిని చదువుతుంటే కొద్ది రోజులక్రిందట తెలుగుకు శిక్ష అన్న ఈమాటలోని కథ క్రింద నేను వ్రాసిన వ్యాఖ్యలో నేనన్న మాట గుర్తుకు వచ్చింది. అది "సందర్భం అంటూ ఒకటి వచ్చింది కాబట్టి ఈమాటను కూడా చెబుతాను. ఒకటి రెండు ప్రయత్నాలు చేసి కూడా ఈమాట పత్రికవారి స్థాయికి తగిన రచనను నేను పంపలేకపోయాను! " అని.)
14, నవంబర్ 2016, సోమవారం
హరి నిన్ను గూర్చి నీవే యాలోచించుకో
హరి నిన్ను గూర్చి నీవే యాలోచించుకో మరి మా కీర్తనల మాట యట్లుండ |
|
కులకులలాడుచు కొత్తకొత్త మతములు మొలకెత్త దొడగె నలుగడల తెలిసితెలియని వారు తెలివైన వారును బిలబిలలాడుచు వెడలుచుండు నెడ |
హరి |
పరదేశసంస్కృతుల భావనలను చదివి పరవశించినిరతము పాడుచును భరతసంస్కృతి నెన్ని పడతిట్టు వారు తరచు నీ చరితల తప్పెన్నెడు నెడ |
హరి |
శ్రీరామ యనుటకే సిగ్గౌను పదిమంది చేరియున్న చోటని న్నేరైనా నోరున్నదని రెచ్చి పేరుకొని తిట్టేరో ఘోరపాపము నన్ను కూడుకొనెడు నెడ |
హరి |
రామునకు మ్రొక్క మీ కేమి కష్టము
రామునకు మ్రొక్క మీ కేమి కష్టము శ్రీ రాముడు కాక వేఱు రక్షకు డున్నాడా |
|
శివదేవు డొక్కనికే చేరి మ్రొక్కెదరొ మీరు చివరకు కాశీపురి చేరదలతురో శివసన్నిధి విడుతురో జీవరత్నములు మీరు శివుడే మీ చెవిలోన చెప్పు రామమంత్రము |
రామునకు |
శివకేశవు లిద్దరును చిల్లరదేవుళ్ళని చెప్పి అవలంబించేరో యన్యధర్మములు చివరకు మీరెచ్చట చేరెదరో తెలియరాదు భువి మతములు పుట్టునట్లు పుట్టరు దేవుళ్ళు |
రామునకు |
ముక్కోటి దేవతలకు మూలపురుషుడైన హరి అక్కజముగ వచ్చినా డందరి కొఱకు చక్కగ లోనెఱిగి మీరు సరగున సేవింతురా నిక్కువముగ శ్రీరాముని నిజధామము చేరుదురు |
రామునకు |
13, నవంబర్ 2016, ఆదివారం
కమలదళేక్షణ భళీభళీ
కమలదళేక్షణ భళీభళీ కమలానాయక భళీభళీ కమలోదరహరి భళీభళీ కమలవదనహరి భళీభళీ |
|
విమలచరిత్ర సుందరగాత్ర సుమధురవరద భళీభళీ అమితవిక్రమ అసురనిగ్రహ అమరనాథనుత భళీభళీ కుమతినివారక సుజనసుపోషక కువలయరక్షక భళీభళీ కమలాసేవిత మునిజనభావిత కమలజసేవిత భళీభళీ |
కమల |
దశావతార త్రిలోకపాలక దైన్యనివారక భళీభళీ ప్రశాంతవదన పరిపంధిజనప్రశాంతిభంజన భళీభళీ విశేషఫలద విమోహనాశక విజ్ఞానప్రద భళీభళీ దశాస్యముఖ్యనిశాచరాధిపదంభవిదళన భళీభళీ |
కమల |
పరమయోగిజనభావితచరణా పరమాత్మా హరి భళీభళీ పరమదయాపర నిరుపమశుభగుణవారాన్నిధి హరి భళీభళీ ధరణీతనయావర సురహితకర దశరథనందన భళీభళీ నరనాయక హరి మోక్షదాయక నను నడిపింతువు భళీభళీ |
కమల |
9, నవంబర్ 2016, బుధవారం
హరినామ జపమున
హరినామజపమున నగుగాక శుభమని పరికించి రాముని భజియించు ఘనుడు | ||
భవదోషముల నెల్ల పడద్రోయ హరినామ మవలంబనం బనుచు నాత్మలో దలచి భువి నందరను గాచి ముక్తినిచ్చెడు దాని నవిరళంబుగ జేయు నతడెపో ఘనుడు | హరి | |
ధవళాయతాక్షుడు ధర్మావతారుడు వవనాత్మజాసేవ్యపాదరాజీవుడు రవికులోత్తముడు శ్రీరాముడే హరియని యెవడు సేవించునో యెంచవాడే ఘనుడు | హరి | |
రాతి నచ్చెరువుగను నాతిగా జేసిన కోతికే బ్రహ్మగా గొప్ప నందించిన ప్రీతితో విభీషణు విభునిగా జేసిన సీతామనోహరుని చేరువాడే ఘనుడు | హరి |
8, నవంబర్ 2016, మంగళవారం
అన్నిటికి నీవు నాకున్నావు
అన్నిటికిని నీవు నాకున్నావు లెమ్మని యున్నాను నిను నమ్ముకున్నాను |
|
అనుభవమ్మును జూచి యాదరించని వారు వెనుక నా దొసగుల వెదకెడు వారు అనువెఱిగి యధికుల మని యాడు వారు కనబడుచున్నట్టి కాని కాల మిదియని |
అన్నిటికి |
ఈ వయస్సున గూడ నేవోవిలాసాల భావించమని చెప్పువారి యొత్తిడుల నే విధంబుగ ద్రోసి నీవలన నుందునో యావంతయును బుద్ధికందక యున్న |
అన్నిటికి |
ప్రేమమీఱగ నీదు నామచింతనమె నామత మగు గాక నా జీవితమును నామార్గమున నడుప నా వలన కాక రాముడా యిక నీవె రక్షించ మనుచు |
అన్నిటికి |
భక్తుని కష్టము భగవంతునిదే
భక్తుని కష్టము భగవంతునిదే శక్తుడ వో రామ సాయపడ |
|
మును కరిరాజు శక్తి మొదలంట సమసిన తన వల్లకాదని దయ పుట్ట నిను వేడుకొన రయమున వచ్చి మొసలిని దునుమిన నీకీర్తి తోరంబాయెను |
భక్తుని |
భక్తాంబరీషద్రౌపద్యాదుల కన త్యక్తుడైన యరిసోదరునకన వ్యక్తపఱచితి దయ యశమును గొంటివి యుక్తి కలవాడు నీభక్తుం డగును |
భక్తుని |
ఈదరాని జలనిధి యీసంసారము నీదియీది యిక బలమేది నిను చేదుకొమ్మని వేడు జీవుడ నన్నును నాదరించవె నీయశమే పెరుగ |
భక్తుని |
7, నవంబర్ 2016, సోమవారం
రాముని దాసుడవా మంచిది
రాముని దాసుడవా మంచిది యిక ఆమడదూరం బరుగు కలి |
|
భగవద్భక్తుల వంకకు పోవుట తగదని భయపడు తంపులమారి నిగమవేద్యుడగు జగదీశ్వరుని పొగడువారల పొడగని పరుగిడు |
రాముని |
నీమ మొప్పగా నిరతము నీవు రామమంత్రపారాయణము ప్రేమమీఱగా వెలయించితివా నీముందిక కలి నిలబడునా |
రాముని |
శ్రీరఘురాముని స్థిరనివాసమున కోరి గుండెను గుడిగా చెసిన ధీరుడవైతే తెలివితక్కువగ చేరబోడు కలి చిక్కులు పెట్టగ |
రాముని |
నమ్ముడిది నమ్ముడిది
నమ్ముడిది నమ్ముడిది నరులార మీరు నెమ్మనముల రామునే నిలుపుడు |
|
శ్రీరామచంద్రుడు చేసినయాజ్ఞ ఆరు నూఱైన జరిగి తీరెడు నాజ్ఞ వారాన్నిధికైన దాట వశమే కాదు నారాయణాజ్ఞ రామనారాయణాజ్ఞ |
నమ్ముడిది |
శ్రీరామచంద్రుని చేతి బాణము ఆరు నూఱైన తగిలి తీరెడు శరము ఘోరపాపుల నది కూల్చితీరును ధారుణిపై నెలకొల్పు ధర్మమార్గము |
నమ్ముడిది |
శ్రీరాముని శరణమని చేరిన జీవి ఆరు నూఱైన శుభము లంది తీరును కోరినచో మోక్షమైన గొంకు లేకయ శ్రీరాముడిచ్చు నింక చింత వీడుడు |
నమ్ముడిది |
హరికృపయే మహదైశ్వర్యము
హరికృపయే మహదైశ్వర్యము హరిస్మరణమె బ్రహ్మానందము |
|
హరియనురాగమె యతిసంతోషము హరిప్రసాదమతిపావనము హరితో చెలిమియె యతివైభోగము హరి తనవాడగు నరుడే ధన్యుడు |
హరి |
హరినామామృత మమితమధురము హరిచరితమత్యధ్భుతము హరిగుణగానమె తరుణోపాయము హరి భక్తుడగు నరుడే ధన్యుడు |
హరి |
హరివిభూతియే యఖిలవిశ్వమును హరికన్యము లేదనగ హరియంశలె జీవాళి నందరును హరియే రాముం డనుచు తెలియుము |
హరి |
శ్రీరాముడవని శ్రీకృష్ణుడవని
శ్రీరాముడవని శ్రీకృష్ణుడవని శౌరి నీకే భజన సలిపెదము |
|
పాడురాకాసుల పట్టిపల్లార్చగ వేడుకతో నిల వెలసితివి వాడిబాణముల వాదరచక్రపు పోడిమి చెడుగుల పొగరణచినది |
శ్రీ |
సారపుధర్మము సత్యవివేకము ధారుణి శుభసంధాయకమౌ చారిత్రంబుల జనులకు చక్కగ నేరిపి బ్రతుకులు నిలబెట్టితివి |
శ్రీ |
మనసునిలిపి నిను మానక కొలిచిన మనుజుని పొందదు మాయయని తనలో నెఱిగిన ధన్యాత్ములకు కొనుడని మోక్షము కొసరెద వీవని |
శ్రీ |
6, నవంబర్ 2016, ఆదివారం
ఇత్తువని పునరావృత్తిరహితపదమును
ఇత్తువని పునరావృత్తిరహితపదమును చిత్తమున నమ్మితి శ్రీరామచంద్ర |
|
కొత్తకొత్త జన్మములు కొత్తకొత్త బంధములు కొత్తకొత్త దుఃఖములు కోరుదునా యెత్తినవే చాలునింక యేలుకోవయ్య నా బత్తినెఱిగి రక్షించ ప్రార్థింతు నిన్ను |
ఇత్తువని |
అందని గౌరవముల కలమటింపులు చాలు పొందినభోగముల పొలుపులు చాలు చెందితి నిదె నీదు శ్రీపాదములకు చే యందించి నను బ్రోవ మనుచు ప్రార్థింతు |
ఇత్తువని |
కోరెడు వారలకు నీవు కొంగుబంగారమవు ఈరేడులోకముల నేలుడు దొరవు నారాముడవని నిన్ను నమ్ముకొన్నాడ నా ప్రేమనెఱిగి బ్రోవుమని వేమరు ప్రార్థింతు |
ఇత్తువని |
బంతులాట లాడె నమ్మ
బంతులాట లాడె నమ్మ భగవంతుడు బల వంతులైన రిపుల తలపండ్లతోడ వేడుకగ |
|
పదునాల్గువేల మంది పైకొన వచ్చిన నదలించి వారి తలలన్నియు నెగిరించె గదిసిన దూషణుని ఖరుని శిరములు విదితాస్త్రుడంత నెగురవేసెను కినిసి |
బంతులాట |
అనిని రావణుని పట్టి యతనితల నెగుర గొట్టె కనుగొన శిరమొండు క్రమ్మర తోచిన నినకులపతి దాని నెగిరించె వేగమె కొనసాగ నీయాట గుట్టలాయె తలలు |
బంతులాట |
ఆడియాడి రావణు నపుడు జంపెను కాని వేడుక తీరెనా వీరరాఘవునవు కన్న వాడు శిశుపాలుడై వచ్చునట్లుగ జేసి కోడెగించు వాని తల కొట్టి ముగించెను |
బంతులాట |
కొలుచుకొన నిమ్మని కోరినంతనె
కొలుచుకొన నిమ్మని కోరినంతనె నీవు కొలువిచ్చినావు నీవు కోదండ రామ |
|
నలినాయతాక్షి లచ్చి నాథుడవగు నిన్ను కొలువగ సీతగా కుదురుకొన్నది వెలసె శేషాహి నిన్ను వెంటనంటి కొలువ తులలేని తమ్ము డీయిలను లక్ష్మణుడన |
కొలుచు |
కొలుచుకొనగ గాలికొడుకు దేవుడవని పిలచి బ్రహ్మపదము కొలిచితివి కొలువున జేరగ కోర విభీషణు నలవోకగ నసురరాజ్యాధిపు జేసితివి |
కొలుచు |
కొలిచిన వారికి కోరిన దిచ్చెద వని తెలిసి చేరితినని తెలియుదువు కొలిచెడు వారికి కొంగుబంగారమవు కలకాలము నన్ను నీకడ నుండనిమ్ము |
కొలుచు |
5, నవంబర్ 2016, శనివారం
హరి యనవే హరి యనవే
హరి యనవే హరి యనవే హరికృప చాలని యనవే యనవే |
|
సకలదేవగణ సకలమౌనిగణ నికరము తనయెడ నిరుపమభక్తిని ప్రకటించగ శ్రీరాముడైన హరి యొకడే చాలని మనసా |
హరి |
హరిని రాముడని యరసి వేడుకను పరమభక్తి గొని పరిపరి విధముల నిరుపమానశుభనిశ్చయ గరిమను విరిసి కొలుచుచు మనసా |
హరి |
శరణు వేడితే కరుణ బ్రోచు నని సురనరవిహగాసురవర్గములు కరము పొగడు నా ఘనుని రాముని హరియని తెలిసిన మనసా |
హరి |
4, నవంబర్ 2016, శుక్రవారం
రామవిద్య యొక్కటే రమ్యవిద్య
రామవిద్య యొక్కటే రమ్యవిద్య క్షేమము చేకూర్చు విద్య రామవిద్య |
|
పామరత్వము విడక బహుశ్రద్ధతో తామసికములైన తదితరములైన ఏమోమో విద్యలు మీ రెంత నేర్చినా రామవిద్యలేని యెఱుక రక్తికట్టదు |
రామవిద్య |
వేదవేదాంగ శాస్త్రవిద్య లెఱిగినా వాదవివాదముల గెలిచి వన్నెకెక్కినా వేదాంతుల శుశ్రూషలు విడక చేసినా లేదు ముక్తి రామవిద్య లేని వానికి |
రామవిద్య |
రామవిద్య నేర్వ మరల రాడు పృధివికి రామవిద్య నేర్వ పోవు రాముని దరికి రామవిద్య నేర్చుటకు రక్తి కలిగెనా రామకృపయె నేర్పునండి రామవిద్య |
రామవిద్య |
ఇతడే భగవంతుడని యెఱుగుడు మీరు
ఇతడే భగవంతుడని యెఱుగుడు మీరు చతురులై కొలిచి ముక్తి సాధించుడు |
|
జ్ఞానస్వరూపుడు జ్ఞానప్రదాయకుడు దేనిపైన రాగమును పూననివాడు తానె జగదీశ్వరుడై తనరెడువాడు మానిత సత్కీర్తిపరుడు మారాముడు |
ఇతడే |
దానవారి ధర్మసంస్థాపనాచార్యుడు పూని యార్తుల నెల్ల ప్రోచువాడు మానవోత్తముడు సర్వమంగళవిక్రముడు జానకీవిభుడు భువనసంరక్షకుడు |
ఇతడే |
సిరులకు నెలవితడు శ్రీనివాసుడు సిరులుపంచు శ్రీనిథి చిన్మయమూర్తి సిరులకు సిరియైన మోక్షశ్రీ నిచ్చువాడు పరమాత్ముడు రాముడు భగవంతుడు |
ఇతడే |
హరిలేడు లేడని యను వానితో
హరిలేడు లేడని యను వానితో హరిభక్తుడు వాదించ నవుసరమేమి |
|
హరిని గూర్చి యవలివాని కరచి చెప్పినా హరితత్త్వము వానిబుద్ధి కవగతమగునా పరమభక్తుడగువాడు బడయు జ్ఞానము పరమశుంఠ బుద్ధి నెట్లు భాసించేను |
హరి |
బహుజన్మల సంస్కార ఫలితము వలన అహరహమును హరిస్మరణానందము కలుగు విహితుడైన హరిని దలచు వేళల యందు అహితులతో వాగ్వాదము లాడకు మీవు |
హరి |
శ్రీరాముడు దైవమని చెప్పుదు వీవు శ్రీరాముని వాడు నింద చేసి నవ్వును ధారుణి బహుజన్మ లెత్తి తానె తెలియును శ్రీరాముడు వాని నపుడు చేరదీయును |
హరి |
అన్నిటి కంటెను ముఖ్యమైనది
అన్నిటి కంటెను ముఖ్యమైనది హరిసాన్నిధ్యమురా చిన్నాచితక సిరులకు భ్రమసిన చిక్కులు తప్పవురా |
|
ఇంతకు ముందుగ నెన్నిమారులో యిలపై పుట్టితివే అంతోయింతో యార్జించితివే యన్నిభవంబులలో అంతగ శ్రమపడి కూడబెట్టినవి యాయాజన్మలతో అంతరించెగా ననుసరించి రాదాయె నేదియైన |
అన్నిటి |
చింతాకంతయు మాధవచింతన చేయకుండు మదిలో చింతలు కాపురముండును సుఖము చేరగ రాకుండు పంతగించి సిరులందు భ్రమలను వదలగొట్టుకొనక ఎంతవగచిన ఫలములేదురా ఎన్నే జన్మలకు |
అన్నిటి |
రామరామయని రామనామమును ప్రేమమీఱ పలికి రామచంద్రపదరాజీవంబుల రక్తిమీఱ గొలిచి రాము డిచ్చునది చాలు నన్యములు రాలురప్పలనుచు నీ మదిలో ధృఢనిశ్చయముండిన నీవు తరింతువురా |
అన్నిటి |
3, నవంబర్ 2016, గురువారం
నే నడిగినదేమి
నే నడిగినదేమి నీ విచ్చినదేమి మానుము నటనలు మాధవా |
|
తెలియని వాడనో తెలిసిన వాడనో తెలిసిన వాడవు దేవా వలచిన మోక్షము కొలువుము మానుము కులుకుచు నవ్వుట కూడదయా |
నే నడిగిన |
నిరతము నటునిటు నింగికి నేలకు తిరుగగ లేనని దేవా హరి శ్రీరామ మోక్ష మడిగిన నీయక మరిమరి త్రిప్పుట మరియాదా |
నే నడిగిన |
తప్పులు సురలను తగులుచు లేవే దెప్పగ వచ్చిన దేవా చప్పున తిరుగుడు చాలనక నా తప్పులు వెదకుట తగదయ్యా |
నే నడిగిన |
నాభక్తి నిజమా నాప్రేమ నిజమా
నాభక్తి నిజమా నాప్రేమ నిజమా యేభయమో నడిపించు నటనయా |
|
రామా నీపై రక్తియున్నదే యది ప్రేముడియా లేక నావెఱ్ఱియా నామతమున నీవు నాసర్వస్వము నీమత మేమయ్య నీకెవ్వడను |
నాభక్తి |
రామయ్య తలచు నీ నామము కన యేమియు నాశించ దా మనసు ఆ మాయకలిభయ మన్నది కతమా నీ మీద ప్రేముడియే నిక్కువమా |
నాభక్తి |
సామాన్యుల యందు సామాన్యుడ రామ నా మార్గము నీకు నచ్చినదా యేమందు విది భక్తి యే యందువా యేమి నీపై భయమే యందువా |
నాభక్తి |
నాగులచవితికి నాగేంద్రా ... బసవరాజు అప్పారావుగారి గీతం
మంచి భావకవి బసవరాజు అప్పారావు గారి నాగులచవితికి నాగేంద్రా నీ పుట్టలోపాలు పోసేము తండ్రీ అన్న గీతాన్ని కన్యాశుల్కం సినిమాలో ఉపయోగించుకున్నారు.
ఆ మనోరంజకమైన పాటను చూచి, విని ఆనందించండి.
ఆసక్తి కలవారు అప్పారావు గారి గీతాలను ఆంద్రభారతిలో చదువుకొని ఆనందించవచ్చును.
1, నవంబర్ 2016, మంగళవారం
నేను నీవను సంజ్ఞలు
నేను నీవను సంజ్ఞ లేటికి కలిగెనో వాని వెంబడి చాల వచ్చినవి |
|
మొదట భేదము పుట్టె నది పుట్టకుండునా సదయ యొండొంటికి సరిపోల్చ యిదియని యదియని యుదయించ కున్నచో నదినీవు యిదినేను నాగ నేముండు |
నేను |
పిదప దూరము పుట్టె నది పుట్టకున్నచో వదలక రెండును కుదురుగను గదిసి యుండును కాదె ముదముగ నొకటైన నదినేను నిదినీవు నన నేమి కలదు |
నేను |
తుదిని కాలము పుట్టె నది పుట్టకున్నచో కదలిక యననేది కలదయ్య కదలక మెదలక ఘనుడా రామయ్య పదిలంబుగ నొక తత్త్వంబుగ నుందుము |
నేను |
నా మనసేలే రామచంద్రునకు
నా మనసేలే రామచంద్రునకు దామోదరునకు దండములు |
|
నిర్మోహునకు నిగమవేద్యునకు కర్మదూరునకు కమలాక్షునకు నిర్మలమూర్తికి నిత్యాశ్రయునకు ధర్మాకృతికివె దండములు |
నా మనసేలే |
పరమపురుషునకు పతితపావనా పరమవ్రతునకు పరమాత్మునకు నిరుపమానునకు నిర్మలసురుచిర దరహాసున కివె దండములు |
నా మనసేలే |
వినయముతో కడు వేడుకతో దనుజవిదారికి దండములు మనుజాధిపునకు మనసా శిరసా తనివితీరగా దండములు |
నా మనసేలే |
31, అక్టోబర్ 2016, సోమవారం
రామనింద చేయువారు రాకాసులే
రామనింద చేయువారు రాకాసులే తామది చేయుదురా ధర్మాత్ములు |
|
పామరత్వము చేత పలుగాకు లగుచు కోమలాంగుల గాంచి కొంకక వదరుచు కామాతురు లగుచు తిరుగాడెడు వారు రాము డేమిసుజను డని ప్రశ్నించుటొక్కటా |
రామ |
తెల్లవారినది మొదలు తెరపిలేక డంబములు కల్లలు కపటములే కాని యన్యములు లేని గుల్ల బుద్ధులవారు గొప్పగా ప్రశ్నింతురె చెల్లునా రాముడు శీలవంతు డనుట యని |
రామ |
కనులు మూసుకొన్న వారు కాంతి లేదన్నటుల మనసు మూసుకొన్న వారు మంచి లేదన్నటుల ఇనకులేశుడు లేడు హీనసంస్కారులకును కనులుతెఱచి మనసునిచ్చు కొనిన కానవచ్చు |
రామ |
దేవతలకు నైన తెలియరాదు హరిమాయ
దేవతలకు నైన తెలియరాదు హరిమాయ ఆ వెన్నుడే యెఱుగు నంతియ కాదే |
|
యిలపైన మాయగొని వెలసెనట రాముడై పులుగుఱేని కిచ్చెనే పొలుపుగా ముక్తిని తులలేనిపద మీయగలవాడు తానైన తెలియునా తెలియదా దేవుడ తానేనని |
దేవ |
సీతకై విపినంబుల చింతించుచు తిరుగ మాత పార్వతి తానే సీతయై శోధింప నాతడను సోదరీ యన్యాయ మిదియని యా తీరుచూడ లీల యనిపించు కాదా |
దేవ |
అవతారపురుషు డట యదియు తానెఱుగ డట కువలయమున తనకన్న గొప్పవాడు లేడట చివరకా బ్రహ్మవచ్చి చెప్పగా వెన్నుడవని అవునా నే దాశరథి ననుకొందు ననునట |
దేవ |
హరి వేగ నామనసు నలుముకోవయ్యా
హరి వేగ నామనసు నలుముకోవయ్యా త్వరపడ కుంటే వచ్చి తానుండురా కలి |
|
సురుచిరముగ నీవు శోభించు మనసులో శిరసులెత్త జాలునా దురూహలు కరమరుదగు ప్రేమతో కరుణాలవాల నీ పరమైన భావనల పరవశించు గాక |
హరి |
తరచుగా నీ నామము తడవు నాలుకపైన పొరపాటు మాటలు పుట్టునా నిరుపమాన మైనట్టి నీగుణముల నెన్నుచు పరిపరివిధంబుల పరవశించు కాక |
హరి |
రాముడవై రాకాసుల ధీమసమ మణచితివి కామక్రోధాది రాకాసులమూక ఆ మాయకలిసైన్య మగుచు చొరబడులోన నా మనసులో నిండి నన్ను కావ కాదా |
హరి |
29, అక్టోబర్ 2016, శనివారం
అంతయును నీకే
అంతయును నీకే యప్పగించి నాను నీ వంత మంచివాడ వనియే రామా |
|
ఏవేవో భవములం దెఱుగక చేసినవి నీవిప్పు డనుభవించ బోవకెట్లు నా వలన నుందువేని యే వెతలును నీకు లేవంటి వందుకే జీవితం బెల్ల నిదె |
అంతయును |
కామక్రోధములు గెలువగాదు నీవలన పామరుల పండితుల వదల వవి యేమరక తారకనామ భజన చేయు మిక తామసహర మంటివని నామనం బెల్ల నిదె |
అంతయును |
భవసాగరమున బడి బయటకు పోలేక చివుకుచుంటి నని చింత యేల నవలంబించుదు వేని న న్నదియే చాలు చాలం టివి గావున పోరాడక తేకువ నాభార మిదె |
అంతయును |
నే నొక్కడ భారమా నీకు
నే నొక్కడ భారమా నీకు గోవింద నేను నీవాడనే కానైతినా |
|
నరహరి మధుసూదన నారాయణాచ్యుత మురహర నరకనిర్మూలనా పరమపురుష బ్రహ్మేంద్రభావిత శ్రీచరణ నరనాయక శ్రీరామ నను బ్రోవవే |
నే నొక్కడ |
హరి పురుషోత్తమ అనిరుద్ధ మాధవ నిరుపమ కృపానిధానమా గరుడధ్వజ పరమాత్మ కమలామనోహర తరచైనవి చిక్కులివి తప్పించవే |
నే నొక్కడ |
భువనాశ్రయ రామ పుండరీకాక్ష దక్ష భవనాశన సర్వపాపఘ్నా శివ జగదీశ మనోహర చింతితార్థప్రద తివిరి నా బుద్ధి చక్కదిద్దరావే |
నే నొక్కడ |
హరిలీల హరిలీల
హరిలీల హరిలీల హరిలీల మేరకే నరు లార మీరెల్ల నర్తించేరు |
|
హరి యాడుమన్న యాట లాడేరు మీరు మిరిపెముతో హరి తిలకించ వరుసగ నవరస భరితములైన పరిపరివిధముల బ్రతుకులతో |
హరిలీల |
హరి పాడు మన్న పాట లాలపించేరు సరగున సరసుడు హరికొఱకు మరి మీదు కోరికల మంచిరాగాలతో నిరతము చేరుచు హరిచెంగటను |
హరిలీల |
హరి చెప్పినట్టు లుండి యలరించేరు నరులా హరినే నడతలను నరులందరకును రామనాయకుడై హరి నేర్పె మంచిబుద్ధు లన్నిటిని |
హరిలీల |
28, అక్టోబర్ 2016, శుక్రవారం
నమ్మిన వానికి నారాయణుడవు
నమ్మిన వానికి నారాయణుడవు నమ్మని వానికి నరమాత్రుడవు |
|
ఈ కనబడు సృష్టి యెల్ల నించుక క్రీడార్థము నీ కల్పన యనగ వెలసె నీ వేడుక ముగియుచో లోకస్థులు లోకేశులు లోకంబులు లేని దగు నీ కడిది నాటకమున నేనుంటిని సుమ్మని |
నమ్మిన |
వరబలగర్వోద్ధతరావణాదుల రణంబున నిరుపమవిక్రమమున నిగ్రహించిద్రుంచితని హరబ్రహ్మేంద్రాదులు నిన్నగ్గించిరి కావున నరాకృతిం గొన్నయట్టి పరాత్పరుడ వేనని |
నమ్మిన |
ముక్తినిచ్చు దొరవనుచు ముదమారగ మనసా శక్తికొలది పూజించుచు చపలత్వము లేక ముక్తసంగులగుచు మంచి బుద్ధిమంతులైన భక్తియుతుల చేయివిడని పరదైవము నీవని |
నమ్మిన |
వసుధనున్న వారి కిదే పరమ మంత్రమే
వసుధనున్న వారి కిదే పరమ మంత్రమే రసనా యిక పలుకవే రామమంత్రమే |
|
సర్వపూజ్యమంత్రమే సకలసిద్ధిమంత్రమే గర్వహరణమంత్రమే గరుడగమను మంత్రమే సర్వవిజయమంత్రమే సర్వశుభదమంత్రమే యుర్వినేలు మంత్రమే యుద్ధరించు మంత్రమే |
వసుధ |
పావనమగు మంత్రమే భవతారకమంత్రమే భావనాతీతుడైన పరమాత్ముని మంత్రమే కావలసిన మంత్రమే కలిహరణమంత్రమే సేవ్యమైన మంత్రమే శివసన్నుతమంత్రమే |
వసుధ |
అందమైన మంత్రమే యాత్మవిద్యామంత్రమే అందరికీ సులభమైన యతిచక్కని మంత్రమే సుందరుడగు శ్రీరాముని చూపించే మంత్రమే పొందదగిన వాని జేసి మోక్షమిచ్చు మంత్రమే |
వసుధ |
చిక్కేమి రామునిపై చిత్తము చేర్చ
చిక్కేమి రామునిపై చిత్తము చేర్చ దక్కు కదా మోక్షమే తప్పక నీకు |
|
రామపదధ్యానముపై రాదా మనసు కోమలాంగిపైననే కుదురుకున్నదా భూములుపుట్రలపైన బుద్ధినిలచునా యేమి లాభమివి యన్ని యెంతనికరము |
చిక్కేమి |
రామగురుచరిత్ర పారాయణంబున మీమనసుల రక్తిలేక మేలు కలుగునా ఏమేమో గురుచరితల నెంతచదివిన యేమిలాభ మవి ముక్తి నీయలేవుగా |
చిక్కేమి |
శ్రీరాముడు సాక్షాత్తు నారాయణుడు శ్రీరాముని భక్తులకు చేటు కలుగదు శ్రీరాముని సేవవలన చేకురు ముక్తి శ్రీరామున కన్యముల చింతయె వలదు |
చిక్కేమి |
రామనామము చాలు
రామనామము చాలు రాముడు చాలు రామేతరముల విరక్తియె చాలు |
|
లౌకికములపై మీ లౌల్యంబు చాలు మీకాలమును వాని మీద వెచ్చించి యా కొంచెముల జొక్కి యన్యాయమగుచు నా కాలు డరుదెంచ శోకించ నేల |
రామ |
కరుగును ప్రాయమ్ము కరుగును బలము కరుగు నధికారమ్ము కరుగు మరియాద హరినామపారాయణానంద మటుల కరుగని దేముండు కాలమ్ము నందు |
రామ |
రాముని పదముల వ్రాలిన వారే కామాదులను గెల్చి కడముట్ట గలరు రాముని యాదినారాయణు డనుచు మీమీ మనములందు ప్రేమించరయ్య |
రామ |
27, అక్టోబర్ 2016, గురువారం
ఉపచారము లేమి చేయుచుంటిమి
ఉపచారము లేమి చేయుచుంటిమి మేము నీ కపచారము లొనరించెడు నల్పులమే కాక |
|
నీవు ధర్మవిగ్రహుడవు నిత్యసత్యవ్రతుడవు భావింపగ సత్యధర్మపథములకు మే మావల వర్తించుచుండు నట్టి వారము మేము మా వీఱిడిబుద్ధులతో మంచిగ పూజింతుమే |
ఉప |
రాకేందువదన భావగ్రాహిరామచంద్ర య స్తోక దయాసాంద్ర మాదోసములనంతము నీ కెఱుకే మమ్ము కలి నీరసింప చేయుట కాకున్న నీకు మేము కడుంగడు దాసులము |
ఉప |
నీ నామము నాలుకపై నిలుపలేని వారమే నీ నిరంజనాకృతిమది నిలుపలేని వారమే నీ నిర్మలకథాపఠన నిరతిలేని వారమే ఓ నిర్వ్యాజకృపాకృతీ యుద్ధరించరావే |
ఉప |
ఒక స్పందన - ప్రతిస్పందనలు - సమాధానం
విశ్వనాథవారు పోతన్న తెలుఁగుల పుణ్య పేటి అన్నారు. పోతన్నగారు అంధ్రీకరించిన భాగవతపురాణం తెలుగువాళ్ళకు ప్రాణప్రదం అయ్యింది. ఒకప్పుడు అందరిళ్ళల్లోనూ కనీసం దశమస్కంధం ఐనా తప్పని సరిగా ఉండేది. కేవలం గృహాలంరణంగా కాదు. దానిని పారాయణం చేసేవారు. లేదా వీలుప్పడల్లా తన్మయత్వంతో పఠించేవారు.
కర్లపాలెం హనుమంత రావు గారు తమ నాకు తెలిసిన లోకం అనే తమ బ్లాగులో ఇటీవల పోతపోసిన ప్రజాకవి = ఈనాడు సంపాదకీయం అన్న టపాను వ్రాసారు. (గమనిక: ఈ టపా ఇప్పుడు కనిపించటం లేదు.)
ఆ టపా క్రింద నేనొక వ్యాఖ్యను వ్రాసాను. అక్టోబరు 24 ఉదయం 7:38ని॥ వ్రాసిన ఆ వ్యాఖ్య ఇదిగో:
ఎవరు వ్రాసారో ఈసంపాదకీయాన్ని!
శ్రీరామచంద్రమూర్తిని రాజమ్మన్యుడు అని సంబోధించటం ఏమిటి? ఎంత విడ్డూరం! రాజమ్మన్యుడు అంటే రాజు అనిపించుకొనే అర్హత లేకపోయినా బడాయికి తనను తానే రాజుగా చెప్పుకొంటూ తిరిగే డాంబికుడు అనీ అర్థం. పోనివ్వండి నానాటికీ జనం తెలుగును తమాషాగా వాడుతున్నారు! నిన్నమొన్ననే వచ్చిన ఒక సినిమా పేరు నాగభరణం. నాగాభరణం కాదు! ఒక్కడు కూర్చుని కథ వ్రాయవచ్చును కాని పదిమంది చేతులు వేయకుండా సినిమా తయారు కాదే, అలాంటిది ఆ సినిమాపేరులో ఉన్న తప్పు ఎవ్వరికీ తట్టలేదందామా లేక పట్టలేదందామా లేక నాగాభరణం కన్న నాగభరణమే వారికి నచ్చిందందామా? ఇంక తెలుగుకు దిక్కు లేదందామా చెప్పండి? రోజూ మీడియాలో ఎవరికి తోచినట్లు వారు తెలుగును అక్షరాలా చంపుకుతింటుంటే ఏమీ చెయ్యలేక విచారపడటం తప్పటం లేదు.
'పాలుకుర్తి'కి చెయ్యిచాస్తే అందే దూరంలో ఉన్న బమ్మెర గూటిలోనే పోతనామాత్యుడు ఉన్నాడని ఖచ్చితంగా చెప్పలేము. ఆ విషయంలో సందేహాలున్నాయి. బమ్మెర ఆయన ఇంటిపేరైనంత మాత్రాన అది ఆయన నివాసస్థలం అన్నట్లుగా ఎలా వ్రాసేయటం? ఆయనిది ఓరుగల్లు అని ఒంటిమిట్ట అని వివాదపడుతున్నారే ఒక ప్రక్కన!
దదుపరి నాకు 25వ తారీఖున 11:32ని॥ ఒక స్పందన వచ్చింది. అది ఈ విధంగా ఉంది:
నమస్తే! రాజమ్మన్యుడు అంటే రాజు అనిపించుకొనే అర్హతలేకపోయినా బడాయికి తనను తానే రాజుగా చెప్పుకొంటూ తిరిగే డాంబికుడు అనీ అర్థం. అన్నారు కదా! సాధికారికమైన నిర్వచనం చూపిస్తే తప్పు ముందు ముందు జరగకుండా సరిచేసుకొనేందుకు వీలవుతుంది. రాజమ్మన్యుడు -కి మీరు చెప్పిన అర్థం వినడం నేనైతే ఇదే మొదటి సారి. శ్యామల గారూ! అలవోకగా వ్యాఖ్యానించి ఉంటే మాత్రం ఒక్క పదాన్ని పట్టుకుని సంపాదకీయం విలువ మొత్తాన్ని తగ్గించినట్లవుతుంది - అని నా భావన.
ఆ వ్యాఖ్య వచ్చిన మరి కొద్ది సేపటికి అంటే 25వ తారీఖున 11:58ని॥ సమయంలో మరొక స్పందన వచ్చింది. అది కూడా చూడండి:
రోజూ మీడియాలో ఎవరికి తోచినట్లు వారు తెలుగును అక్షరాలా 'చంపుకుతింటుం'టే ఏమీ చెయ్యలేక విచారపడటం తప్పటం లేదు- అన్నారు, తెలుగు స్వరూప స్వభావాలు చెదిరిపోతున్నాయన్న మీ చింత కొంత అర్థం చేసుకోదగినదే కానీ.. మారుతున్న కాలం ప్రకారం భాష.. వ్యక్తీకరణలలో మార్పు రాకుండా ఆపడం ఎవరికీ సాధ్యం కాని విషయం అని నా భావన. సినిమావాళ్ల తెలుగు పరిజ్ఞానాన్ని ఈ టపాకింద ఉదహరించ తెలుగు చచ్చి పోతున్న విధానానికి నొచ్చుకోవడం సబబు కాదని.. అనిపిస్తున్నది నాకు. పోతన జన్మస్థలం గురించి మీరన్నట్లు బమ్మెర .. ఓరుగల్లా అన్న చర్చకు ఇది సరైన వేదిక కాదు. ఆ తరహా చర్చలక్ దిగేందుకు ఈ సంపాదకీయం కేవలం మౌలికంగా వివిధ భావాల సాహిత్య మాలిక. ఈ కారణాల చేత మీ వ్యాఖ్యానాన్ని ఆ బ్లాగు కింది వ్యాఖ్యలనుంచి తొలగించాలని అనుకుంటున్నాను. మీ స్పందనకు ధన్యవాదాలు.
కొద్ది సేపటి క్రిందట నాకు వచ్చిన పై స్పందనలకు సమాధానం వ్రాద్దామని ఆ పోతపోసిన ప్రజాకవి = ఈనాడు సంపాదకీయం అన్న టపాను దర్శించయత్నిస్తే ఆ టపాయే కనిపించ లేదు. అందుచేత నా సమాధానాన్ని హనుమంత రావు గారికి తెలియజేయటం ఎలాగు?
అందుచేత ఇలా టపా ద్వారా వారికి సమాధానం వ్రాస్తున్నాను.
మొదట రాజమ్మన్యుడు అన్న మాట గురించి నేను చెప్పిన అర్థాన్ని ఆయన ఇంతవరకూ వినలే దంటున్నారు హనుమంత రావుగారు. కాని నేను చెప్పినది ప్రసిద్ధమైనదే కాని క్రొత్త విశేషం ఏమీ కాదు.
మీరు ఆంధ్రభారతి - తెలుగు నిఘంటువు పేజీ లోపల పండితమ్మన్యుడు అన్న పదాని అర్థాన్ని చూడండి. మీకు శ్రమ అవసరం లేకుండా అక్క డేముందో క్రింద చూపుతున్నాను.
పండితమ్మన్యుడు
పండితమ్మన్యుడు : తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
సంస్కృత విశేషణము
తన్ను పండితునిగా తలచుకొనెడివాడు.
పండితంమన్యుడు/పండితమ్మన్యుడు/ పండిత మాని : పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 201
[హిందూ]
తనను తాను పండితుడుగా భావించు కొనేవాడు.
ఇదేదో వెబ్-సైట్ నిఘంటువు కదా ఏమంత సాధికారికమైనది అన్న అనుమానం మీకు రావచ్చును. కాని వారు తమ అర్థానికి ప్రమాణాలనూ ఎత్తి చూపారు కదా. మీకు అనుమానం ఉంటే ఎవరైన వయోవృద్ధులైన తెలుగు లేదా సంస్కృతపండితులను సంప్రదించండి. నేను వయోవృద్ధులైన అనటానికి కారణం ఈనాటి తెలుగుపండితులలో అనేకులకు ఉన్న తెలుగుపరిజ్ఞానం మరీ అంత నమ్మదగ్గది కాకపోవటమే.
హనుమంతరావు గారూ, నేను ఒకవేళ అలవోకగా వ్యాఖ్యానించానేమో అని అడుగుతున్నారు కాని అలాంటిదేమీ లేదని నమ్మకంగా చెప్పగలను. ఒకవేళ నాకే అంత తెలుగులో పరిజ్ఞానం సరిపోకపోయినా నా బుద్ధికి ఎలా తోస్తే అలా అన్నానేమో అని మీరు విస్మయపడటంలో ఆశ్చర్యం లేదు. అలా చేసే వారూ దండిగానే ఉంటారు, ఉన్నారు కూడా.
ఇకపోతే మీడియాలో ఎవరికి తోచినట్లు వారు తెలుగును అక్షరాలా 'చంపుకుతింటుం'టే ఏమీ చెయ్యలేక విచారపడటం తప్పటం లేదు అనటంలో అనౌచిత్యం ఏమీ లేదనే అనుకుంటున్నాను.
ఈ రోజున ప్రింట్ మీడియాలోనూ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ కూడా కనిపించే వినిపించే తెలుగు చాలా నేలబారుగానే ఉంటోంది.
మీడియా ప్రసక్తి అనుచితం అనుకోవద్దండి. ప్రజలు, ముఖ్యంగా విద్యార్థిదశలో ఉన్నవాళ్ళకు మాతృభాష చుట్టుప్రక్కల ఉన్న మనుష్యుల ద్వారా ఎంత అవగాహనకు వస్తుందో అంతగానే మీడియాద్వారా కూడా అవగాహనలోనికి వస్తుంది. అందుకే వారికి కనిపించే వినిపించే భాషయొక్క స్వరూపస్వభావాల ప్రమాణాలను దిగజారనిస్తూ పోతూ ఉదాసీనంగా ఉండి కాలం మారుతోంది అనటం సబబు కానేకాదు.
పోతన జన్మస్థలం ప్రసక్తి టపాలోనే ఉన్నప్పుడు దానిపై వ్యాఖ్యానించటానికి మీరు అభ్యంతరం చెప్పకూడదు కదా.
మీరు నా వ్యాఖ్యను తొలగించా లనుకుంటే దానికి నా దగ్గర అభ్యంతరం లేదు. మీ బ్లాగు మీ నిర్ణయం. మీకు నచ్చనిది మీరు తొలగించ వచ్చును దానికేమి.
ఐతే మొత్తం టపానే తొలగించటం ఆశ్చర్యం కలిగించింది.
ఈ టపా ఉద్దేశం కేవలం నా సమాధానాన్ని హనుమంతరావు గారికి తెలియ చేయటమే కాని ఇదేదో వివాదం అని ఎవరూ ఊహలూ అపోహలూ చేయవద్దని అందరికీ మనవి.
నిజానికి హనుమంతరావు గారి ఉద్దేశం రాజమాన్యుడు అని చెప్పటం అనుకుంటాను. వారు కొద్దిగా పొరబడి రాజమ్మన్యుడు అన్నారు. ఐతే అర్థం సరిగా తెలియకుండా ఒక మాట వాడటం వలన అది శ్రీరామచంద్రమూర్తికి వారు చేయబోయిన పురస్కారం కాస్తా తిరస్కారంగా మారింది. ఉపచారం కాస్తా అపచారం ఐనది. ఆ దోషం నాకు చాలా మనస్తాపం కలిగించింది. భాషలో మెలకువలు పెద్దలనుండి పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి ప్రకటించే ముందు అందరూ ఒకటికి పదిమార్లు సరిచూసుకొనక తప్పదని నా అభిప్రాయం. ముఖ్యంగా ఈకాలంలో ఒక కవిత ఐనా వ్యాసం ఐనా జనందాకా వెళ్ళటానికి అనేక దారులు సులభంగా దొరుకుతున్నాయి. కాబట్టి తప్పుల విషయంలో మరింతగా జాగరూకత వహించాలని అందరమూ తప్పక గ్రహించవలసి ఉంది.
కర్లపాలెం హనుమంత రావు గారు తమ నాకు తెలిసిన లోకం అనే తమ బ్లాగులో ఇటీవల పోతపోసిన ప్రజాకవి = ఈనాడు సంపాదకీయం అన్న టపాను వ్రాసారు. (గమనిక: ఈ టపా ఇప్పుడు కనిపించటం లేదు.)
ఆ టపా క్రింద నేనొక వ్యాఖ్యను వ్రాసాను. అక్టోబరు 24 ఉదయం 7:38ని॥ వ్రాసిన ఆ వ్యాఖ్య ఇదిగో:
ఎవరు వ్రాసారో ఈసంపాదకీయాన్ని!
శ్రీరామచంద్రమూర్తిని రాజమ్మన్యుడు అని సంబోధించటం ఏమిటి? ఎంత విడ్డూరం! రాజమ్మన్యుడు అంటే రాజు అనిపించుకొనే అర్హత లేకపోయినా బడాయికి తనను తానే రాజుగా చెప్పుకొంటూ తిరిగే డాంబికుడు అనీ అర్థం. పోనివ్వండి నానాటికీ జనం తెలుగును తమాషాగా వాడుతున్నారు! నిన్నమొన్ననే వచ్చిన ఒక సినిమా పేరు నాగభరణం. నాగాభరణం కాదు! ఒక్కడు కూర్చుని కథ వ్రాయవచ్చును కాని పదిమంది చేతులు వేయకుండా సినిమా తయారు కాదే, అలాంటిది ఆ సినిమాపేరులో ఉన్న తప్పు ఎవ్వరికీ తట్టలేదందామా లేక పట్టలేదందామా లేక నాగాభరణం కన్న నాగభరణమే వారికి నచ్చిందందామా? ఇంక తెలుగుకు దిక్కు లేదందామా చెప్పండి? రోజూ మీడియాలో ఎవరికి తోచినట్లు వారు తెలుగును అక్షరాలా చంపుకుతింటుంటే ఏమీ చెయ్యలేక విచారపడటం తప్పటం లేదు.
'పాలుకుర్తి'కి చెయ్యిచాస్తే అందే దూరంలో ఉన్న బమ్మెర గూటిలోనే పోతనామాత్యుడు ఉన్నాడని ఖచ్చితంగా చెప్పలేము. ఆ విషయంలో సందేహాలున్నాయి. బమ్మెర ఆయన ఇంటిపేరైనంత మాత్రాన అది ఆయన నివాసస్థలం అన్నట్లుగా ఎలా వ్రాసేయటం? ఆయనిది ఓరుగల్లు అని ఒంటిమిట్ట అని వివాదపడుతున్నారే ఒక ప్రక్కన!
దదుపరి నాకు 25వ తారీఖున 11:32ని॥ ఒక స్పందన వచ్చింది. అది ఈ విధంగా ఉంది:
నమస్తే! రాజమ్మన్యుడు అంటే రాజు అనిపించుకొనే అర్హతలేకపోయినా బడాయికి తనను తానే రాజుగా చెప్పుకొంటూ తిరిగే డాంబికుడు అనీ అర్థం. అన్నారు కదా! సాధికారికమైన నిర్వచనం చూపిస్తే తప్పు ముందు ముందు జరగకుండా సరిచేసుకొనేందుకు వీలవుతుంది. రాజమ్మన్యుడు -కి మీరు చెప్పిన అర్థం వినడం నేనైతే ఇదే మొదటి సారి. శ్యామల గారూ! అలవోకగా వ్యాఖ్యానించి ఉంటే మాత్రం ఒక్క పదాన్ని పట్టుకుని సంపాదకీయం విలువ మొత్తాన్ని తగ్గించినట్లవుతుంది - అని నా భావన.
ఆ వ్యాఖ్య వచ్చిన మరి కొద్ది సేపటికి అంటే 25వ తారీఖున 11:58ని॥ సమయంలో మరొక స్పందన వచ్చింది. అది కూడా చూడండి:
రోజూ మీడియాలో ఎవరికి తోచినట్లు వారు తెలుగును అక్షరాలా 'చంపుకుతింటుం'టే ఏమీ చెయ్యలేక విచారపడటం తప్పటం లేదు- అన్నారు, తెలుగు స్వరూప స్వభావాలు చెదిరిపోతున్నాయన్న మీ చింత కొంత అర్థం చేసుకోదగినదే కానీ.. మారుతున్న కాలం ప్రకారం భాష.. వ్యక్తీకరణలలో మార్పు రాకుండా ఆపడం ఎవరికీ సాధ్యం కాని విషయం అని నా భావన. సినిమావాళ్ల తెలుగు పరిజ్ఞానాన్ని ఈ టపాకింద ఉదహరించ తెలుగు చచ్చి పోతున్న విధానానికి నొచ్చుకోవడం సబబు కాదని.. అనిపిస్తున్నది నాకు. పోతన జన్మస్థలం గురించి మీరన్నట్లు బమ్మెర .. ఓరుగల్లా అన్న చర్చకు ఇది సరైన వేదిక కాదు. ఆ తరహా చర్చలక్ దిగేందుకు ఈ సంపాదకీయం కేవలం మౌలికంగా వివిధ భావాల సాహిత్య మాలిక. ఈ కారణాల చేత మీ వ్యాఖ్యానాన్ని ఆ బ్లాగు కింది వ్యాఖ్యలనుంచి తొలగించాలని అనుకుంటున్నాను. మీ స్పందనకు ధన్యవాదాలు.
కొద్ది సేపటి క్రిందట నాకు వచ్చిన పై స్పందనలకు సమాధానం వ్రాద్దామని ఆ పోతపోసిన ప్రజాకవి = ఈనాడు సంపాదకీయం అన్న టపాను దర్శించయత్నిస్తే ఆ టపాయే కనిపించ లేదు. అందుచేత నా సమాధానాన్ని హనుమంత రావు గారికి తెలియజేయటం ఎలాగు?
అందుచేత ఇలా టపా ద్వారా వారికి సమాధానం వ్రాస్తున్నాను.
మొదట రాజమ్మన్యుడు అన్న మాట గురించి నేను చెప్పిన అర్థాన్ని ఆయన ఇంతవరకూ వినలే దంటున్నారు హనుమంత రావుగారు. కాని నేను చెప్పినది ప్రసిద్ధమైనదే కాని క్రొత్త విశేషం ఏమీ కాదు.
మీరు ఆంధ్రభారతి - తెలుగు నిఘంటువు పేజీ లోపల పండితమ్మన్యుడు అన్న పదాని అర్థాన్ని చూడండి. మీకు శ్రమ అవసరం లేకుండా అక్క డేముందో క్రింద చూపుతున్నాను.
పండితమ్మన్యుడు
పండితమ్మన్యుడు : తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
సంస్కృత విశేషణము
తన్ను పండితునిగా తలచుకొనెడివాడు.
పండితంమన్యుడు/పండితమ్మన్యుడు/ పండిత మాని : పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 201
[హిందూ]
తనను తాను పండితుడుగా భావించు కొనేవాడు.
ఇదేదో వెబ్-సైట్ నిఘంటువు కదా ఏమంత సాధికారికమైనది అన్న అనుమానం మీకు రావచ్చును. కాని వారు తమ అర్థానికి ప్రమాణాలనూ ఎత్తి చూపారు కదా. మీకు అనుమానం ఉంటే ఎవరైన వయోవృద్ధులైన తెలుగు లేదా సంస్కృతపండితులను సంప్రదించండి. నేను వయోవృద్ధులైన అనటానికి కారణం ఈనాటి తెలుగుపండితులలో అనేకులకు ఉన్న తెలుగుపరిజ్ఞానం మరీ అంత నమ్మదగ్గది కాకపోవటమే.
హనుమంతరావు గారూ, నేను ఒకవేళ అలవోకగా వ్యాఖ్యానించానేమో అని అడుగుతున్నారు కాని అలాంటిదేమీ లేదని నమ్మకంగా చెప్పగలను. ఒకవేళ నాకే అంత తెలుగులో పరిజ్ఞానం సరిపోకపోయినా నా బుద్ధికి ఎలా తోస్తే అలా అన్నానేమో అని మీరు విస్మయపడటంలో ఆశ్చర్యం లేదు. అలా చేసే వారూ దండిగానే ఉంటారు, ఉన్నారు కూడా.
ఇకపోతే మీడియాలో ఎవరికి తోచినట్లు వారు తెలుగును అక్షరాలా 'చంపుకుతింటుం'టే ఏమీ చెయ్యలేక విచారపడటం తప్పటం లేదు అనటంలో అనౌచిత్యం ఏమీ లేదనే అనుకుంటున్నాను.
ఈ రోజున ప్రింట్ మీడియాలోనూ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ కూడా కనిపించే వినిపించే తెలుగు చాలా నేలబారుగానే ఉంటోంది.
మీడియా ప్రసక్తి అనుచితం అనుకోవద్దండి. ప్రజలు, ముఖ్యంగా విద్యార్థిదశలో ఉన్నవాళ్ళకు మాతృభాష చుట్టుప్రక్కల ఉన్న మనుష్యుల ద్వారా ఎంత అవగాహనకు వస్తుందో అంతగానే మీడియాద్వారా కూడా అవగాహనలోనికి వస్తుంది. అందుకే వారికి కనిపించే వినిపించే భాషయొక్క స్వరూపస్వభావాల ప్రమాణాలను దిగజారనిస్తూ పోతూ ఉదాసీనంగా ఉండి కాలం మారుతోంది అనటం సబబు కానేకాదు.
పోతన జన్మస్థలం ప్రసక్తి టపాలోనే ఉన్నప్పుడు దానిపై వ్యాఖ్యానించటానికి మీరు అభ్యంతరం చెప్పకూడదు కదా.
మీరు నా వ్యాఖ్యను తొలగించా లనుకుంటే దానికి నా దగ్గర అభ్యంతరం లేదు. మీ బ్లాగు మీ నిర్ణయం. మీకు నచ్చనిది మీరు తొలగించ వచ్చును దానికేమి.
ఐతే మొత్తం టపానే తొలగించటం ఆశ్చర్యం కలిగించింది.
ఈ టపా ఉద్దేశం కేవలం నా సమాధానాన్ని హనుమంతరావు గారికి తెలియ చేయటమే కాని ఇదేదో వివాదం అని ఎవరూ ఊహలూ అపోహలూ చేయవద్దని అందరికీ మనవి.
నిజానికి హనుమంతరావు గారి ఉద్దేశం రాజమాన్యుడు అని చెప్పటం అనుకుంటాను. వారు కొద్దిగా పొరబడి రాజమ్మన్యుడు అన్నారు. ఐతే అర్థం సరిగా తెలియకుండా ఒక మాట వాడటం వలన అది శ్రీరామచంద్రమూర్తికి వారు చేయబోయిన పురస్కారం కాస్తా తిరస్కారంగా మారింది. ఉపచారం కాస్తా అపచారం ఐనది. ఆ దోషం నాకు చాలా మనస్తాపం కలిగించింది. భాషలో మెలకువలు పెద్దలనుండి పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి ప్రకటించే ముందు అందరూ ఒకటికి పదిమార్లు సరిచూసుకొనక తప్పదని నా అభిప్రాయం. ముఖ్యంగా ఈకాలంలో ఒక కవిత ఐనా వ్యాసం ఐనా జనందాకా వెళ్ళటానికి అనేక దారులు సులభంగా దొరుకుతున్నాయి. కాబట్టి తప్పుల విషయంలో మరింతగా జాగరూకత వహించాలని అందరమూ తప్పక గ్రహించవలసి ఉంది.
25, అక్టోబర్ 2016, మంగళవారం
నీవు దేవుండని యేవాని నమ్మెదో
నీవు దేవుండని యేవాని నమ్మెదో జీవుడ వానినే చెందదవు |
|
భూతప్రేతములను పూజించ నీవా భూతాదులనే పొందెదవు ప్రీతి దేవతల తగురీతుల గొల్చిన ఖ్యాతిగ వారల కలసెదవు |
నీవు |
చపలత్వంబున సాగి యజ్ఞుడవై కపటగురువు టక్కరిబోధ నపదైవంబుల నారాధించిన విపరీతయోనుల వేగెదవు |
నీవు |
మరల చెప్పగనేల మానక రాముని పరదైవంబని లోనెఱిగి నిరతము చింతించ నిష్కలుషుడవై పరమపదమునే బడసెదవు |
నీవు |
పరులు తలచిన హరితోడ్పడవలె
పరులు తలచిన హరితోడ్పడవలె హరిసంకల్పం బప్రతిహతము |
|
అది యిది చేయుదు ననుకొను నరునకు తుది జరుగునది తెలిసేనా అది శ్రీహరికే విదితము కాక మదిలో నెఱుగుట మనుజుని తరమా |
పరులు |
హరి నేమార్చగ నజుడెంచినను పరికింపగ నది భగ్నంబాయె హరి తాను గోగోపకానీక మైన హరు వెరుగక నల్లాడెను కాదే |
పరులు |
సురలు ధర్మాత్ములు హరి వారి తోడు సురవైరులను హరియణచు నరుడై దశరథనందనుడై హరి పరిమార్చడె రావణప్రభృతుల |
పరులు |
24, అక్టోబర్ 2016, సోమవారం
వినయగుణము నీయ నట్టి విద్యదండుగ
వినయగుణము నీయ నట్టి విద్యదండుగ జనకసుతావరు నెఱుగని జన్మదండుగ |
|
దానగుణము లేకుండిన ధనము దండుగ అభి మానగుణోత్కర్ష లేని మనికి దండుగ పూనికతో చేయకుండు పనులు దండుగ నిం డైన భక్తి లేని పూజలన్న దండుగ |
వినయ |
బోధగురువు మాట వినని బుధ్ధి దండుగ ఒక బాధగురువు నాశ్రయించ బ్రతుకు దండుగ సాధకుడు కాని వాని చదువు దండుగ మరి మాధవనిలయమ్ము కాని మనసు దండుగ |
వినయ |
కసరుచు వాదించుచు తిరుగాడి దండుగ దు ర్వ్యసనంబులు దోచినట్టి వయసు దండుగ రసనాద్యింద్రియములందు రక్తి దండుగ ఈ వసుసుదతీత్యాదులందు భ్రాంతి దండుగ |
వినయ |
22, అక్టోబర్ 2016, శనివారం
ఇది శుభమని
ఇది శుభమని నిర్ణయించున దెవరు ఇది యశుభంబని యెఱుగున దెవరు |
|
పట్టభంగ మశుభంబని పౌరులు పట్టరాని దుఃఖభావము నొంద చెట్టరావణుని చీడవదలినది యిట్టిది హరిలీల యెఱుగ రితరులు |
ఇది |
కొడుకు రాజగునని కోరిన వరములు పడి చెఱచగ తన పసుపుకుంకుమల నడిగిన శుభమున నశుభము కలెగె నడచును హరిలీల లన నీ పగిదిని |
ఇది |
శుభమశుభంబని చూడగ నేటికి విభుని లీలలని వేడుక నెంచక అభయదాయకుడు హరి రాముండై యుభయంబుల తోడుండగ మనకు |
ఇది |
మనసున రాముడు మాత్రము కలడని
మనసున రాముడు మాత్రము కలడని యనగలిగితివా యది మేలు మనసిచ్చితివా రఘువల్లభుడు మరువక సేమము కూర్చునయా |
|
హరి యాత్మీయుడు కరుణామయుడై యరుదెంచిన శుభసమయమున నరుడా నీ వెటువంటి విధంబున జరిపెదవో నీ సేవలను పరిపరి విధముల పరిచర్యలతో ప్రభువుకు మోదము కూర్చెదవో పొరబడి నిర్లక్ష్యము చేసెదవో బుద్ధిహీనత బయలుపడ |
మనసున |
అక్కర వేళల పదుగుర కొకగది యమరించెడు విధమను నటుల చక్కగ కామక్రోధాదులకును సవరించితివా హరిగదిని నిక్కువ మాహరి నీచుల సరసన నిలువనేరక వెడలునయా దక్కిన యవకాశంబును విడువక దశరథనందను కొలువవయా |
మనసున |
మనసు పాతసామానుల గది వలె మారుట మంచిదికాదు సుమా పనికిమాలిన చెత్తనంతటిని పారవేసి సవరించవయా మునుకొని హరిమయమగు తలపులతో మనసును తీరిచి దిద్దవయా యినకులపతిమందిరమై యుండిన మనసే మనసని తెలియవయా |
మనసున |
21, అక్టోబర్ 2016, శుక్రవారం
అంతరంగమున హరి యున్నాడు
అంతరంగమున హరి యున్నా డిక చింతలెక్కడి వీ జీవునకు |
|
ఏజన్మంబున నెంచి పట్టెనో యీజీవుడు హరిచరణముల పూజలెన్నిటిని పొలుపుగ జేసెనొ యోజకు వచ్చుచు నున్నాడిదిగో |
అంత |
రామనామమున రక్తిజనించిన ధీమంతున కిక తిరుగేదీ ప్రేమమయునిపై పెరుగగ మమత కామితమన్యము కలుగుట యున్నే |
అంత |
వైకుంఠంబున భాసిలు శ్రీహరి లోకోద్ధరణకు కాకుత్స్థుఁడుగా ప్రాకటముగ రామభద్రుండై తన లో కొలువుండగ లోటొకటున్నే |
అంత |
అదికోరి యిదికోరి యలమటించుటె కాని
అదికోరి యిదికోరి యలమటించుటె గాని పదపడి దొఱకు కర్మఫలమొక్కటే మనకు |
|
వెనుకటి భవముల మనమెఱుంగము కాని మునుకొను నట్టి కాలమునకు మర పేమి వెనునంటు సంచిత మనుభవింపక పోదు కనుక కర్మత్రయము గడచు టది యెట్లో |
అదికోరి |
విదులకైన నహము వదిలించు కోన గాదు చదువు సాముల నహము వదలుట కల్ల మొదలైన హరిధ్యాస హృదయంబు నందు కదలిక కలిగి యది కరుగుట జరుగు |
అదికోరి |
నరులందరకు రామనారాయణుడు దిక్కు మరువక శ్రీరామమంత్రమును నోట తిరముగా నెలకొల్పి పరమాత్మకృపతో పొరిగొనదగు కర్మమూలంబు లెల్ల |
అదికోరి |
20, అక్టోబర్ 2016, గురువారం
నీ వుండగా నాదు భావంబున నిల్చి
నీ వుండగా నాదు భావంబున నిల్చి యే వార లేమన్న నేమయ్య రామయ్య |
|
పదిమంది పొగడిన ఫలమేమి కలుగును కొదవేమి కొందరు తిట్టినను ముదమున నన్నీవు వదలక యుండిన నది చాలు పరులాడు నవి విన నేల |
నీ వుండగా |
మెచ్చి యొక రిచ్చు నవి మేలేమి చేయును పుచ్చుకొని మురిసిముక్కలు గా నచ్చంపు మేళుల నిచ్చు వాడవు నన్ను గ్రుచ్చి యెత్తి మోక్షమిచ్చెదవు కాకేమి |
నీ వుండగా |
అన్యుల గణించిన నగును బహుబంధ విన్యాస మది చాల వెగటని నీ కన్య మెఱుగక యుందు నటులున్న చాలదే ధన్యత్వమును చెంద దాల్చిన జన్మంబు |
నీ వుండగా |
ఏ మందు మో రామ
ఏ మందు మో రామ ఈ నాడు రావణు ప్రేమించు వారును పెరుగుచున్నారయ్య |
|
ఆలి నెత్తుకపోయి నట్టివానిని నీవు కోలనేసితివని కోపింతురయ్య కూళలు వారైన కోపించి పెనగరో ఆలి నన్యులు పట్ట నానంద పడుదురో |
ఏ మందు |
దళితుడందురు వారు దశకంఠు వింటివా దళితుడా యబలల బలిమిని బట్టి దళితుడా లోకాల దర్పించి మొత్తి దళితు డనుమాట కర్థంబునే తెలియరే |
ఏ మందు |
బలహీనులను కాపాడుట ధర్మమని ఇల నాచరించి చూపిన వాడ వీవు తెలియ నొల్లని వారి దీనతను ద్రుంచి కలకదేర్చ వలయు కాదనక శ్రీహరి |
ఏ మందు |
18, అక్టోబర్ 2016, మంగళవారం
వివిధము లైనను మార్గములు
వివిధము లైనను మార్గములు తుది వెన్నుని చేరెద రందరును ప్రవిమలురు ఘనపాపులును భగవంతుని తప్పక చేరెదరు |
|
గిరిశిఖరంబును చేరుకొనుటకు తరచుగ నెన్నో మార్గముల నరయగ సుగమంబుమలు కొన్ని మరియును దుష్కరములు కొన్ని నరుడే మార్గము పట్టిపోయినను నమ్మకముగ శృంగము చేరు పొరి యత్నంబున చేరుదురు ముందువెనుకగ నందరును |
వివిధము |
నదిని దాటుటకు పద్ధతులనగ నరులకు తెలియును విశదముగ వదలక యీతకొట్టు వారలును పదిలముగా పడవెక్కు వారలును గదిసి వంతెనను దాటు వారలన కనుగొన మూడు విధంబు లిటు ముదమున నరులు నదిని దాటుదురు ముందువెనుకగ నందరును |
వివిధము |
చేరి ప్రేమతో సేవించినచో శ్రీహరి చెంతను మురిసెదరు వైరభావమును పూని మెలగినను వదలడు హరి రప్పించు కొను నారాయణుని శీఘ్రమ చేరగ నామస్మరణం బుత్తమము శ్రీరామా రఘరామ పాహియని చేయుడి నామము మరువకను |
వివిధము |
అందరకు పతియనగ హరియొక్కడే
అందరకు పతియనగ హరియొక్కడే మన కందరకు గతియనగ హరియొక్కడే |
|
తల్లియగుచు తండ్రియగుచు తనరుచు లోకంబుల నెల్లవేళలను హరియే కద ప్రోచును చల్లని స్వామి వాని సంగతియే యందరకు కొల్లగా సుఖములు కురిపించు తనివార |
అందరకు |
భక్తిసిద్ధాంతముల యందు పాండిత్యము లేదా భక్తులను తెలియ నీ వలనగాదా శక్తికొలది శ్రీహరిని స్మరియించ గలుగుదువా యుక్తి యదే చాలు హరి యుండు నీకు ప్రీతుడై |
అందరకు |
రాముడై కృష్ణుడై రాకాసులనణచివైచి భూమినేలినవాడు పురుషోత్తముడు కామాది రిపుగణక్షయము చేసి నిను కాచు రామరామరామ యనుటె రక్షయగును నీకు |
అందరకు |
కల్క్యావతారము
కలిదురాగతములు ఖండింపంగ నిలపైన కల్కివై వెలసెదవు నీవు |
|
తులువలు ధరనాక్రమించి దోపిడికాండ్రై కలిపురుషుని యండతో కావరంబున పలుబాధలు పెట్టుచుండ ప్రజావళిని కావ వెలసెదవు నీవు విష్ణుయశుని కొడుకువై |
కలి |
హరియజ్ఞము లేమి హరిచరితము లేమి హరినామము లేమి యంతరింపగ హరి నీవు వత్తువు లోకావనశీలుండవై మరల పుడమిపైన సత్యమార్గము వెలుగ |
కలి |
శ్రీమన్నృసింహుడవై చెండి కనకకశిపుని రాముడవై రావణుని రాల్చినావు భూమిభారము కృష్ణమూర్తివై తీర్చితివి నీ మహిమము చేత కలినిర్మూలిత మగును |
కలి |
17, అక్టోబర్ 2016, సోమవారం
బుద్ధావతారం
బుద్ధివాదముల జూప పురుషోత్తముడు బుద్ధుడై ధరణిపై బుట్టినాడు |
|
తపజపహోమాదికతత్పరు లయ్యు జగ దపకారులగుచు నధికులై విపరీతముల జేయు కపటదైత్యులకు చపలత్వము కల్గి బుధ్ధిసత్త్వమడగ |
బుద్ధి |
వేదము లందున వివరంబుల తర్క వాదంబుల జొచ్చి పలుకుచు భేదించెను దైత్యవరుల బుధ్ధులెల్ల మోదించి సురలంత మొత్తి రసురులను |
బుధ్ధి |
తమకే తపములు తమకే వేదములు తమకే భోగమని తలచుచు తమకంబున నున్న తన్నడే వెన్నుండు భ్రమలణచడె నాడు రాముడై రణమున |
బుద్ధి |
15, అక్టోబర్ 2016, శనివారం
లోకనాయకుడవని నీకు చెప్పుకొందుము
లోకనాయకుడవని నీకు చెప్పుకొందుము మా కష్టము శ్రీరామ మన్నింపుము |
|
మొదట భువనముల జేసి ముచ్చటగా నీవు పదునాలుగు సుందరముగ భాసించ తుదిలేని క్రీడ నొండు మొదలిడితివి గాద యిదిగిదిగో యీజీవుల మిచట నాడగ |
లోక |
మరియాద కప్పుడపుడు మామధ్య కరుదెంచి పరమదివ్యలీలలను పచరించి అరిగెదవు క్రీడాంగణ మంతయు సరిజేసి పరుగిడిపరుగిడి మేము బడలితి మయ్య |
లోక |
ఆడలేక మొత్తుకొను నట్టి జీవాళి మయ్య వేడుకొందు మొక్కింత విశ్రాంతి ఆడించువాడ మా కానతి దయచేయ వయ్య వేడకతో తొల్లింట విశ్రమించు డనుచు |
లోక |
గోపగోపీజనసంతోషరూప గోపబాల
గోపగోపీజనసంతోషరూప గోపబాల పాపకదళీవనకుఠారరూప గోపబాల |
|
నారదాదిసుజనహృద్విహారి గోపబాల క్రూరకంసనిర్మూలనకుశల గోపబాల దారుణారివర్గవిదళనదక్ష గోపబాల ధారుణీభారాపనయనధీర గోపభాల | గోప |
రూపవిజితశతశతమదనాటోప గోపబాల పాపరాజగర్వవిదళనకోప గోపబాల చాపధరశ్రీరామచంద్రరూప గోపబాల తాపహరణశీల కలిసంతాప గోపబాల | గోప |
పాహి దీనజనావనశీల పాహి గోపబాల పాహి పార్థవిజయకారణ పాహి గోపబాల పాహి భక్తజనసందోహవరద గోపబాల పాహి పాహి విష్ణుదేవ పాహి నందబాల | గోప |
14, అక్టోబర్ 2016, శుక్రవారం
మా రామచంద్రు డండి మంచివా డండి
మా రామచంద్రు డండి మంచివా డండి నారాయణమూర్తి యండి నమ్మండి |
|
అతిమనోహరుడండి అందాల గని యండి ప్రతిలేని వీరు డండి రామచంద్రుడు సతి సీత నెత్తుకొని జనిన రావణుని బట్టి చితుకగొట్టి చంపె నండి చెలగి యీ కోదండి |
మా రామ |
పరమ కారుణికుడండి పగవాడే అలయుచో మరల రేపు రమ్మనే మంచి వాడు సుండి పరమధర్మమూర్తి యండి పగతుని తమ్ముడికి శరణమిచ్చి రాజ్యమిచ్చు సాత్వికుడండి |
మా రామ |
సురరాజ సేవ్యు డండి శుభ్రప్రకాశు డండి హరవిరించి వినుతుడండి ఆదిపురుషు డండి పరమయోగిసేవ్యు డండి భావనాతీతు డండి నరులారా రండి రండి నమ్మి సేవించండి |
మా రామ |
నా కెందు కాస్వర్గము
నా కెందు కాస్వర్గ మేకోరికయు లేని నా కెందుకు దాని సౌకర్యము |
|
నీ నామమది యిచ్చు నానందమే చాలు నే నితరముల కోర బోనయ్య నా నాలుకకు రుచి నీ నామమే కాక యా నాకమందున్న యమృతంబును కాదు |
నా కెందుకు |
నా మానసంబున నీ మూర్తి యుండగ కామితంబులు వేరు కలిగేనా ఏమేమొ భోగాల కిరవైన స్వర్గంబు పై మోహపడుదునా పరికించి చూడ |
నా కెందుకు |
శ్రీరామచంద్రుడ చేయెత్తి మ్రొక్కెద నా రొంపిస్వర్గంబు నట్లుంచుమా ఈరేడులోకాల నేలు నీ యండయే పారమ్యమని నేను భావింతు నయ్య |
నా కెందుకు |
13, అక్టోబర్ 2016, గురువారం
గజేంద్ర మోక్షమా - గజేంద్రమోక్షణమా?
హరిబాబు గారు ఈనెల ఏడవ తారీఖున ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేసారు:
ఒక చిన్న ముఖ్యమైన సందేహం,గజేంద్ర మోక్షం కధని "గజేంద్ర మోక్షణం" అని మాత్రమే అనాలి,ఆ సనివేశంలో మోక్షం ఇవ్వలేదు - కేవలం మకరి పట్టునుంచి విడిపించటం మాత్రమే జరగడం వల్ల మోక్షణం అనాలి అని ఒకరు చెప్పగా విన్నాను.కానీ నేను మీకిచ్చిన లింకు దగ్గిర గజేంద్ర మోక్షంకధా ప్రారంభం అని ఉంది.వ్యాసవిరచిత మూలంలో ఎలా ఉంది?
ముందుగా పోతనామాత్యుల రచన చూదాం. ఆయన అష్టమస్కందంలో 135వ పద్యంలో 'ఈ కృష్ణానుభావమైన గజరాజమోక్షణకథ వినువారికి యశములిచ్చును కల్మషాపహంబు దుస్స్వప్ననాశంబు దుఃఖసంహారంబు' అని శుకయోగీంద్రుని వాక్యంగా రచించారు. ఆ పద్యం పూర్తిపాఠం ఇదిగో.
సీ. నరనాథ! నీకును నాచేత వివరింపఁ
బడిన యీ కృష్ణానుభావమైన
గజరాజమోక్షణకథ వినువారికి
యశము లిచ్చును గల్మషాపహంబు
దుస్స్వప్న నాశంబు దుఃఖ సంహారంబుఁ
బ్రొద్దున మేల్కాంచి పూతవృత్తి
నిత్యంబుఁ బఠియించు నిర్మలాత్ముకులైన
విప్రులకును బహువిభవ మమరు
తే.గీ. సంపదలు గల్గుఁ బీడలు శాంతిఁ బొందు
సుఖము సిద్ధించు వర్థిల్లు శోభనములు
మోక్ష మఱచేతిదై యుండు ముదము చేరు
ననుచు విష్ణుండు ప్రీతుఁడై యానతిచ్చె.
ఇక సంస్కృతభాగవత పురాణం చూదాం.
వ్యాస భాగవతంలో
అష్టమస్కందం మొదట్లో ఒకశ్లోకంలో
తత్రాపి జజ్ఞే భగవాన్హరిణ్యాం హరిమేధసః
హరిరిత్యాహృతో యేన గజేన్ద్రో మోచితో గ్రహాత్
అని ఉంది. మోచనం అంటే విడిపించటం (మన తెలుగువాళ్ళకు విమోచనం అన్నమాట బాగా పరిచితమైనదే)
హరివలన మకరిపీడ తొలగిన గజేంద్రుడి సంగతిని ఇలా వ్యాసభాగవతం చెబుతున్నది.
గజేన్ద్రో భగవత్స్పర్శాద్విముక్తోఽజ్ఞానబన్ధనాత్
ప్రాప్తో భగవతో రూపం పీతవాసాశ్చతుర్భుజః
పోతనగారి సీసపద్యం మొదట ఉదహరించాను కదా, దానిమూలం వ్యాసప్రోక్తంగా ఇలా ఉంది:
ఏతన్మహారాజ తవేరితో మయా
కృష్ణానుభావో గజరాజమోక్షణమ్
స్వర్గ్యం యశస్యం కలికల్మషాపహం
దుఃస్వప్ననాశం కురువర్య శృణ్వతామ్
అని.
శాపగ్రస్తుడైన ఇంద్రద్యుమ్నుడనే రాజు ఏనుగైనాడు. ఆయనకు కలిగిన మోక్షణం కేవలం మకరినోటి నుండే కాదు, హరిధ్యానంలో ఉండి అగస్త్యముని రాకను గమనించని కారణంగా పొందిన శాపం నుండి కూడా. అంతే కాదు భవబంధాలనుండి కూడా మోక్షణం పొందాడు. అదే మోక్షం. సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యములనే చతుర్విధముక్తుల్లో ఒకటైన సారూప్య ముక్తి ఆ గజరాజుకు హరిప్రసాదంగా లభించింది. అందుకే గజేంద్రుడు ప్రాప్తో భగవతో రూపం పీతవాసాశ్చతుర్భుజః అయ్యాడు. అనగా భగవంతుని రూపాన్నే పొందాడు అయన వలెనే పీతాంబరధారి అయ్యాడు చతుర్భుజములనూ పొందినాడు. అంటే గజరాజు ఇంక ఏనుగు వలె కాక విష్ణువువలె ఉన్నాడు అని కదా పిండితార్ధం.
దీనికి మరొక సాక్ష్యం గజేంద్రమోక్షణానంతరం గజరాజుతో హరిపలికిన మాటలే. ఇంకా శంక ఉంటే ఏదో రకంగా, అది కూడా తీర్చే మాటలు హరిప్రోక్తములే ఉన్నాయక్కడనే.
యే మాం త్వాం చ సరశ్చేదం .... అని మొదలు పెట్టి చివరన
యే మాం స్తువన్త్యనేనాఙ్గ ప్రతిబుధ్య నిశాత్యయే
తేషాం ప్రాణాత్యయే చాహం దదామి విపులాం గతిమ్
అని చెబుతాడు శ్రీహరి. హరి మాం..త్వాం.. అనటం గమనించండి. నన్నూ, నిన్నూ అని మొదలు పెట్టి స్తవనీయమైన మరికొన్ని విభూతులనూ పేర్కొని వీటిని స్మరించిన వారు ముచ్యన్తే తేఽహసోఽఖిలాత్ - అనగా అన్ని బంధాలనుండీ విముక్తులైపోతారని చెప్పాడు హరి. అంతే కాదు వారికి ప్రాణావసాన కాలంబున మదీయంబగు విమలగతిని ఇస్తాననీ చెప్పాడు. విమలగతి అంటే మోక్షం. ఈగజేంద్రస్మరణంతోనే మోక్షాధికారసిద్ధి అంటే ఆ గజరాజుకు మోక్షం వచ్చిందా అని మరలా ప్రశ్న వేసుకోవలసిన అగత్యం ఉందా?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)