28, డిసెంబర్ 2016, బుధవారం

మాకు సర్వస్వమై మారాము డున్నాడు


మాకు సర్వస్వమై మారాము డున్నాడు
మీ కెవ్వరున్నారు మీరె చెప్పుడయ్య

కర్మసముఛ్ఛయము నందు కల లబ్ధి సున్న
కర్మఫలము దారితీయు కర్మములకు
దుర్మానములు బాపి నిర్మలత్వము గూర్చి
కర్మవిముక్తుల జేయ గలడా మీ‌దేవుడు
మాకు

లేనిపోని కొంగ్రొత్త జ్ఞానమార్గములు వచ్చె
దేని కెంత ఫలితమన్న దెలియరాదు
మీ నిజతత్త్వమ‌ందు మిమ్ము నిలుపలేని
వానిచే దెలుపబడు వాడెట్టి వాడగును
మాకు

ఎవడో ఒకడిని దేవు డితడని నమ్మి కొల్చితే
చివరకు దక్కునదేమొ చెప్పరాదు
భవరోగము మాన్పు వైద్యుడెవ్వడో వాని
దవులు కొన్న మీకు ఫలము దక్కును గాని
మాకు


2 కామెంట్‌లు:

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.