13, డిసెంబర్ 2016, మంగళవారం

చిన్నవారు పెద్దవారు చేరి మ్రొక్కుడీ


చిన్నవారు పెద్దవారు చేరి మ్రొక్కుడీ మీ
కున్న చింతవంత లన్నియు వీడుడీ

ఇతని పేరు చెప్పినంత నెల్ల లోకనాయకులు
నతిబలశాలుర నసురుల తుళువల
నితడు చంపెనని యెంచి యెంచి వేడ్కతో
నతులు చేయుదురు చాల నమ్రులై నిలచి
చిన్న

ఇతని పేరు చెప్పినంత నింతింత యనరాక
నతిశయించెడు భక్తి నందరు సజ్జనులును
యితని సద్గుణముల నెంచి నెంచి వేడ్కతో
నతులు చేయుదురు చాల నమ్రులై నిలచి
చిన్న

ఇతని పేరు చెప్పినంత యెట్టిపాపములైన
చితికి నుగ్గైచను చేరునెల్ల శుభములును
యితడిచ్చు మేళుల నెంచి యెంచి వేడరే
యతులితమగు మోక్షమందించు రాముని
చిన్న


1 కామెంట్‌:

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.