13, డిసెంబర్ 2016, మంగళవారం

మాయలేమి చేయలేదు


మాయలేమి చేయలేదు మహిమలేమి చూపలేదు
మాయయ్య రామయ్య మరి నీతి తప్పలేదు

ఒరులేల శివుని యుత్తమ ధనువును
మరి యెత్తలేరైరొ మాకే మెఱుక
గురువుల యనుమతి గొని రఘువరుడు
కరముల గొన నదె ఖండము లాయె
మాయ

తానై చనలేదు దండకలో నుండ
తానై దనుజుల తాకబోవడు వారె
పూని పదునాల్గువేలు బొబ్బలిడుచు వచ్చి
వాని నెదిరించి నంత భస్మమైరంతె
మాయ

పనిగొని రావణు డనువాడు సీతను
గొనిపోయె మ్రుచ్చిలి కొరవితోడ
తనకేల తలగోకుకొన బుద్ధి కలిగెనో
కనగ భూభారమెల్ల కరిగిన దంతె
మాయ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.