27, డిసెంబర్ 2016, మంగళవారం

ఏమి చేసేదయా యింత సామాన్యుడను


ఏమి చేసేదయా యింత సామాన్యుడను
రాముడా దారి చూపరాదటయ్య

బాగొప్ప వేదాంతపరిభాష నెఱుగనే
నీ గొప్పదనమది నేర్పేనో
ఆ గజిబిజి వేదాంత మబ్బకున్నను
నే గొంటి నీభక్తి నిజమిది నిజము
ఏమి

ఏ గురువును నొకమంత్ర మీయనే లేదే
సాగి యొకదీక్షగొని జపముచేయ
యోగీశ్వరేశ్వర యొక్క నీ నామమే
నా గతి యని నమ్మి నానిది నిజము
ఏమి

యేది మంచి దేది చెడుగొ యెంచగా లేనే
యేది దారి యని నేను యెంచితిని
శ్రీదయితుడా దీన చింతామణీ నీదు
పాదములే చక్కగ పట్టితి నిజము
ఏమి


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.