15, డిసెంబర్ 2016, గురువారం

బడయుడు శుభములు


బడయుడు శుభములు బడయుడు సుఖములు
బడయుడు శ్రీరామచంద్ర భజనంబున

బడయుడు రాముడు పరమాప్తుడై యుండి
పెడమోము కాక ప్రేముడితోడను
నడిగిన వన్నియును నమరించు చున్నాడు
కడుభక్తులరైయుండి బడయుడన్నియును
బడయుడు

బడయుడు రాముడు పరమగురుండై యుండి
యడగించి సందియంబులనెల్ల
కడుయోగ్యులను జేయు జ్ఞానమిచ్చుచున్నాడు
తడయక మీరతని చేరి తత్త్వమెఱుగుడు
బడయుడు

అడిగడిగో రాముడు మన కందరకు మోక్షము
నిడ సంసిధ్ధుడై యిదిగో పిలచె
వడివడిగ పరమాత్ముని భావించి మించరే
బడయ మీ కింకేమి వలయునో చెప్పరే
బడయుడు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.