14, డిసెంబర్ 2016, బుధవారం

కొలిచి నీకు నేనిచ్చుకొన నేమున్నది


కొలిచి నీకు నేనిచ్చుకొన నేమున్నది
తలచి నీవిచ్చినవి తప్ప నాకడ లేవు

తనువా యిది నీవు దయతో నిచ్చినది
మును పిట్టి వెన్నో ముదమార
గొనుమని వివిధములను నాకిచ్చి నీ
పనులను నావలన బాగుగ గొంటివే
కొలిచి

మనసా యిది నీవు మంచివర్తనము
లను దాని లోపలను పొదగి
తనివార నది నిన్ను తద్దయు వేడుక
గొనియాడ నిత్యము వినుచుందువే
కొలిచి

నను నీదు ప్రతిబింబ మనియందువు నా
దని నొకడెన్న దగునా రామ
నను నేను నీలోన కనుచుందు గావున
కొనుమని నన్నిచ్చు కొనువాడ నంతియె
కొలిచి


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.