27, డిసెంబర్ 2016, మంగళవారం

పట్టె శ్రీరామవిభుని పాదములను హనుమ


పట్టె శ్రీరామవిభుని పాదములను హనుమ
పట్టుమని బ్రహ్మపదము ప్రభువొసగెను వినుమ

ఒక కోతికి దక్కినదే యున్నతమగు పదము
యకళంకభక్తి కది యద్భుతమగు వరము
సకలజీవరాశులకు సముడు శ్రీరాముడు
వికసరోరుహనేత్రుడు విభీషణవరదుడు
పట్టె

అతడు నవవ్యాకరణము లభ్యసించినాడు
అతడు నవనిథులగుట్టు లన్ని యెఱిగినాడు
అతడు శ్రీరామచంద్రు నాశ్రయించినాడు
అతడు లోకారాథ్యు డగుచు వెలసినాడు
పట్టె

శ్రీరాముని శుభనామము చెలగు నెల్ల తావుల
ఆరూఢిగ సజలనయను డగుచు వ్రాలు మారుతి
ఈరేడు లోకముల లేరతనికి సాటి
చేరబిలచి బ్రహ్మనుగా చేసె రాముడందుకే
పట్టే