27, డిసెంబర్ 2016, మంగళవారం

దేవతలున్నారు దేనికి


దేవతలున్నారు దేనికి నీకు నాకు
కావలసిన విచ్చి వారు కదలిపోయేరు

ఒక్కొక్క కోరిక పుట్ట నొక్కక్క దేవత నెంచి
యొక్క ప్రొద్దులు పురాణోక్తస్తోత్రంబులు
చక్కగా వ్రతములు సాగి మంత్రదీక్షలును
నెక్కటిభక్తి ఘటించి యెచటికి చేరెదరు
దేవత

వారిచ్చునవి యెంత వరకు నిత్యంబులు
వారిచ్చు వరముల వలచి తపించినను
వారిజాక్షియొ బలమొ బంగారమో యెంచి
కోరగలము గాని ముక్తి కోర వీలగునె
దేవత

వారికి నైన నాపదలు వచ్చుచు నుండును
వారు నారాయణుని పదము లంటెదరు
ధారుణి నున్న మనకు దశరథరాముడై
కోరిన ముక్తి నీయ కొలువాయె శౌరి
దేవత