అవనిపై నుండు వా రందరు నిటులే యెవరి దారి వారిదగుచు నేగెడు వారే |
|
ఎవరి నడక వారిది యెవరి నడత వారిది ఎవరి బలిమి వారిది యెవరి కలిమి వారిది ఎవరి పలుకు వారిది యెవరి గిలుకు వారిది ఎవరి పదము వారిది యెవరి చదువు వారిది |
అవని |
ఎవరి కులుకు వారిది యెవరి ఉలుకు వారిది ఎవరి తెగువ వారిది యెవరి తెగులు వారిది ఎవరి తలపు వారిది యెవరి వలపు వారిది ఎవరి మెతుకు వారిది యెవరి బ్రతుకు వారిది |
అవని |
ఇవల సకల జీవులు తివురు వికట విధమిది యవల కలుగు జీవిత మెవరి కెఱుక గానిది ఎవడు రామచంద్రుని యెఱిగి కొలుచు నాతడె ఇవల నవల రాముని యెదుట నుండు నెప్పుడు |
అవని |
12, ఫిబ్రవరి 2017, ఆదివారం
అవనిపై నుండు వా రందరు నిటులే
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
చాలా రోజులకి కొత్త రామసంకీర్తన రాసినట్టున్నారు - ఇది బావుంది. ముఖ్యంగా మూడో చరణం చాలా బావుంది. చదవగానే "ఎక్కడి మానుష జన్మంబెత్తిన ఫలమేమున్నది ..." అన్న అన్నమాచార్య కీర్తన జ్ఞప్తికొచ్చింది.
రిప్లయితొలగించండిజీవన విధానం బాగా చెప్పారు.
రిప్లయితొలగించండిధన్యవాదాలండీ. అందరూ కలిసి బ్రతికే జగన్నాటకరంగంలో ఎవరికివారుగానే ఉంటున్నారు ఎన్ని బంధాలు పైపైన కనబడుతున్నా. అందుకనే నాతిచరామి అని చెప్పించేటప్పుడు కూడా మోక్షేచ అని చెప్పించరు - ఎంత ఒకటై బ్రతికినా ఎవరి సాధనాక్రమం వారిదే కావటం వలన.
తొలగించండిఎవరిబలుపువారిది,ఎవరికులుకువారిది,ఎవరిగోలవారెదే!
రిప్లయితొలగించండిచాలా రోజుల తరవాత
శర్మగారూ, లలితగారూ సెలవిచ్చినట్లు చాలా రోజుల తరువాత మరలా వ్రాస్తున్నాను. ఎందుకనో మనస్సు వ్రాతపైకి పోవటం లేదు. మానసికంగా రామసంకీర్తనం ఆగటం అన్నది ఎన్నడూ లేదు కాని అవి అచ్చులోనికి తేవటానికి ఆయన ప్రేరణ చేయలేదెందుకో తెలియదు.
రిప్లయితొలగించండి