భజే శంభు మీశాన మానంద కందం భజే సర్వలోకైకనాథం మహేశం భజే పార్వతీవల్లభం పాపనాశం భజే కామదం మోక్షదం శంకరం త్వం |
భజే కాలకాలం ప్రపన్నార్తినాశం భజే యక్షరాజేంద్రమిత్రం పవిత్రం భజే వాయుభుంగ్మాలికాభూషితాంగం భజే కామదం మోక్షదం శంకరం త్వం |
భజే సర్వలోకేశసంసేవ్య మూర్తిం భజే సర్వమౌనీంద్రసంచిత్య మూర్తిం భజే సాంబమూర్తిం సదాశాంతమూర్తిం భజే కామదం మోక్షదం శంకరం త్వం |
భజే వేదవేదాంగసంస్తుత్య మూర్తిం భజే మౌనముద్రాస్థితం జ్ఞానమూర్తిం భజే ధ్యానమూర్తిం పరబ్రహ్మమూర్తిం భజే కామదం మోక్షదం శంకరం త్వం |
భజే రుద్రమూర్తిం భజే భద్రమూర్తిం భజే ప్రాణమూర్తిం భజే విశ్వమూర్తిం భజే యోగమూర్తిం భజే లింగమూర్తిం భజే కామదం మోక్షదం శంకరం త్వం |
23, ఫిబ్రవరి 2017, గురువారం
శివస్తుతి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
శ్యామలరావుగారు, ఈనామానికి అర్థం చెప్పగలరు. "వాయుభూమ్గాల్మీకభూషితాంగం"
రిప్లయితొలగించండి"భజే వాయుభుంగ్మాలికాభూషితాంగం"
రిప్లయితొలగించండిఅయ్యా వాయుభుక్కు అంటే పాము. మాలిక అంటే దండ. వాయుభుక్ + మాలిక = వాయుభుంగ్మాలిక అని సంధికార్యం. అర్థం పాముల దండ. సరి, భూషణం అంటే తెలిసిన మాటే కదా. పాములు దండలుగా వేసుకున్నవాడని శివుణ్ణి సంబోధించటం అన్న మాట.
ధన్యవాదాలండి. సంధి విడగొట్టగానే అర్థం అయ్యింది.
తొలగించండిచాలా బాగుంది.
రిప్లయితొలగించండిఆనందో బ్రహ్మ!
భజే శంకరం లోక వశంకరం
అవును కదండీ అందుకే ఎత్తుగడలోనే పరమశివుణ్ణి ఆనందకందస్వరూపుడని సంబోధించటం.
తొలగించండిమనోహరమైన శివస్తుతి. ధన్యవాదాలు!
రిప్లయితొలగించండిమీకు నచ్చినందుకు ధన్యవాదాలు.
తొలగించండిచాల బాగుంది
రిప్లయితొలగించండిమావయ్యా,
తొలగించండితప్పొలేమన్నా ఉంటే నాకు తెలియజేయ ప్రార్థన.
శ్యామలీయంగారు: మీ శివస్తుతి స్తుతింపదగినదిగా వుంది - శుభాభినందనలు. ఒక్క సందేహం - పాము ఎలా వాయు-భుక్ అయిందండి?
రిప్లయితొలగించండిలలిత గారూ,
తొలగించండిఇదొక కవి సమయం. నిజంగా పాము కేవలం గాలిమేసి బ్రతికేస్తుందని కాదు. కాని సాహిత్యంలో పాముకు అలాంటి వాడుక ఉంది. అందుచేత కవిత్వంలో వాతాశని, వాతాశి, మారుతాశనము, పవనపారణము, పవనాశము, గాలిమేతరి, గాలిదిండి, గాడ్పుదిండి అంటూ సంబోధిస్తూ ఉంటారు.
కలువలు చంద్రోదయంతోనూ పద్మాలు సూర్యోదయంతోనూ వికసిస్తాయని కవిత్వంలో తరచూ కనిపిస్తూ ఉంటుంది. కాని అది నిజం కాదు. ఐనా అది ఒక కవిసమయంగా తీసుకొని అలా వ్రాస్తూనే ఉంటారు కవులు.
శ్యామలీయంగారు: ఓపిగ్గా వివరించిన మీకు ధన్యవాదాలు!
తొలగించండి