వినయగుణము నీయ నట్టి విద్యదండుగ జనకసుతావరు నెఱుగని జన్మదండుగ |
|
దానగుణము లేకుండిన ధనము దండుగ అభి మానగుణోత్కర్ష లేని మనికి దండుగ పూనికతో చేయకుండు పనులు దండుగ నిం డైన భక్తి లేని పూజలన్న దండుగ |
వినయ |
బోధగురువు మాట వినని బుధ్ధి దండుగ ఒక బాధగురువు నాశ్రయించ బ్రతుకు దండుగ సాధకుడు కాని వాని చదువు దండుగ మరి మాధవనిలయమ్ము కాని మనసు దండుగ |
వినయ |
కసరుచు వాదించుచు తిరుగాడి దండుగ దు ర్వ్యసనంబులు దోచినట్టి వయసు దండుగ రసనాద్యింద్రియములందు రక్తి దండుగ ఈ వసుసుదతీత్యాదులందు భ్రాంతి దండుగ |
వినయ |
24, అక్టోబర్ 2016, సోమవారం
వినయగుణము నీయ నట్టి విద్యదండుగ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
''విద్య యొసగును వినయంబు'' పాతమాటా! పనికిరాని మాటా?
రిప్లయితొలగించండిప్రస్తుతం పనికిరాని మాట అనే జనం అనుకుంటున్నారేమో నండి. 'అమెరికా పంపని విద్య అనవసరవిద్య' అనీ 'చదువున కొక సత్ఫలమ్ము సంపాదనయే' అనీ జనం అనుకుంటున్నారని అనిపిస్తున్నది. ఐనా పాతకాలం వాడిని కదా, నా ధోరణిలో నేను చెబుతున్నా నన్నమాట.
తొలగించండి