18, అక్టోబర్ 2016, మంగళవారం

కల్క్యావతారముకలిదురాగతములు ఖండింపంగ
నిలపైన కల్కివై వెలసెదవు నీవు

తులువలు ధరనాక్రమించి దోపిడికాండ్రై
కలిపురుషుని యండతో కావరంబున
పలుబాధలు పెట్టుచుండ ప్రజావళిని కావ
వెలసెదవు నీవు విష్ణుయశుని కొడుకువై
కలి

హరియజ్ఞము లేమి హరిచరితము లేమి
హరినామము లేమి యంతరింపగ
హరి నీవు వత్తువు లోకావనశీలుండవై
మరల పుడమిపైన సత్యమార్గము వెలుగ
కలి

శ్రీమన్నృసింహుడవై చెండి కనకకశిపుని
రాముడవై రావణుని రాల్చినావు
భూమిభారము కృష్ణమూర్తివై తీర్చితివి
నీ మహిమము చేత కలినిర్మూలిత మగును
కలి


1 కామెంట్‌:

 1. ఇల సుజనుల నివు ఇంపుతొ గనుగొని
  ఖలులను కనుగొని ఖండించుటకును
  జలజనయన యీ కలియుగాంతమున
  కలికి మూర్తివై కలిగెదవౌర
  కలికావతారా! జయ కలికావతారా!

  రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.